గ్యాంగ్స్టర్ నయీం చేతిలో దారుణహత్యకు గురైన బెల్లి లలిత సోదరుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు.
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ చేతిలో దారుణ హత్యకు గురైన బెల్లి లలిత సోదరుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. 18 సంవత్సరాలుగా ఢిల్లీలో తలదాచుకుంటున్న లలిత అన్నకృష్ణ శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. నయీం అకృత్యాలపై గళమెత్తిన బెల్లి లలితను నయీం ముఠా అత్యంత కిరాతకంగా చంపింది.
1999 మే 26న నల్లగొండ జిల్లా భువనగిరిలో ఆమె హత్యకు గురైన విషయం తెలిసిందే. తర్వాత లలిత కుటుంబంలో మరో నలుగురు వరుసగా హత్యగావించబడ్డారు. వరుస ఘటనలతో తీవ్ర భయాందోళనకు గురైన కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవల పోలీసుల చేతిలో నయీం ఎన్కౌంటర్ అయిన నేపథ్యంలో ఆయన తిరిగి బయటకు వచ్చారు. ఈ రోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడనున్నారు.