సంకీర్త్‌ కుటుంబానికి దత్తాత్రేయ పరామర్శ | bandaru dattatreya console sankeerth family | Sakshi
Sakshi News home page

సంకీర్త్‌ కుటుంబానికి దత్తాత్రేయ పరామర్శ

Jul 21 2016 4:27 PM | Updated on Sep 4 2017 5:41 AM

అమెరికాలో దారుణహత్యకు గురైన తెలుగువిద్యార్ధి సంకీర్త్ కుటుంబాన్ని బండారు దత్తాత్రేయ పరామర్శించారు.

హైదరాబాద్‌ : అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలుగు విద్యార్ధి సంకీర్త్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం పరామర్శించారు. సుల్తాన్‌ బజార్‌లోని సంకీర్త్ నివాసానికి వెళ్లిన ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంకీర్త్ హత్య తనని కలచివేసిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ విషయంపై అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భగా సంకీర్త్‌ తం‍డ్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తనకు కలిగిన పుత్రశోకం ఎవరికీ రాకూడదన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement