అసెంబ్లీకి ఊతకర్రతో వచ్చిన బాలకృష్ణ | Balakrishna with crutch comes to Assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీకి ఊతకర్రతో వచ్చిన బాలకృష్ణ

Aug 19 2014 2:44 AM | Updated on Aug 29 2018 1:59 PM

అసెంబ్లీకి ఊతకర్రతో వచ్చిన బాలకృష్ణ - Sakshi

అసెంబ్లీకి ఊతకర్రతో వచ్చిన బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఊతకర్ర సాయంతో సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు. తొలి రోజు సమావేశాలు ముగిసే వరకూ ఆయన సభలో ఉన్నారు.

 సాక్షి, హైదరాబాద్: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  ఊతకర్ర సాయంతో సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు. తొలి రోజు సమావేశాలు ముగిసే వరకూ ఆయన సభలో ఉన్నారు. ఇటీవల ఒక సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రతి సిని మాకు తనకు గాయం గుర్తుంటుందన్నారు. తాజాగా జరిగి న ప్రమాదంలో తగిలిన గాయానికి ఏడు కుట్లు పడ్డాయని, అది తగ్గిపోయేందుకు వారం పడుతుందని చెప్పారు. తన వందో చిత్రంపై ప్రజల్లో భారీ అంచనాలున్నాయని తెలిపారు. తాను దర్శకుల వెంట పడే రకం కాదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement