వసంత్ నగర్లో కమాన్ కూలి ముగ్గురు మృతి | Arche collapsed in kukatpally vasanth nagar, three dead | Sakshi
Sakshi News home page

వసంత్ నగర్లో కమాన్ కూలి ముగ్గురు మృతి

Aug 2 2016 4:53 PM | Updated on Sep 4 2017 7:30 AM

నిర్మాణంలో ఉన్న కమాన్ కూలి ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. కూకట్పల్లి వసంత్ నగర్ లో మంగళవారం నిర్మాణంలో ఉన్న కమాన్ కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు నాగభూషణం, జనార్దన్, పుల్లారావుగా గుర్తించారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement