అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి  | Shooting in America, Three dead. | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి 

Jun 2 2025 4:32 AM | Updated on Jun 2 2025 7:34 AM

Shooting in America, Three dead.

వాషింగ్టన్‌: అమెరికాలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఒక పోలీసు అధికారి సహా ముగ్గురు చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. లాస్‌ ఏంజెలెస్‌ నగరంలోని బాల్డి్వన్‌ పార్క్‌లో శనివారం రాత్రి 7 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రైఫిల్‌తో కాల్పులకు దిగాడు. ఘటనలో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు. 

అనంతరం అధికారులు మరో మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రుడికి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. మరో ఘటన..నార్త్‌ కరోలినాలోని కటౌబా కౌంటీలో శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న మరో కాల్పుల ఘటనలో ఒకరు చనిపోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement