ట్యాంకర్ ఢీ కొని వృద్ధురాలు మృతి | an old woman died by hitting a tanker | Sakshi
Sakshi News home page

ట్యాంకర్ ఢీ కొని వృద్ధురాలు మృతి

Mar 29 2015 2:22 PM | Updated on Sep 2 2017 11:33 PM

వేగంగా వెళ్తున్న ట్యాంకర్ రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఢీ కొట్టింది.

ఎల్బీనగర్: వేగంగా వెళ్తున్న ట్యాంకర్ రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఢీ కొట్టింది. ఈ సంఘటన ఆదివారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్‌నగర్‌లోని డిమార్ట్ షోరూం వద్ద చోటుచేసుకుంది. వివరాలు..రామాంతపూర్‌కు చెందిన అండాలమ్మ(65) రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే అటుగా వచ్చిన మంచి నీటి ట్యాంకర్ ఆమెను ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement