అగ్రిగోల్డ్ కేసులో మిగతా డైరెక్టర్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది.
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో మిగతా డైరెక్టర్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీఐడీ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించింది. మరింత లోతుగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. దర్యాప్తులో 70 ఆస్తులను గుర్తించామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. ఆస్తుల వేలం ప్రక్రియకు సహకరించాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్, మేనేజింగ్ డెరైక్టర్ అవ్వాసు వెంకట శేషు నారాయణరావు, ఎండీ రామిరెడ్డి శ్రీరామచంద్రారావు, డెరైక్టర్ పఠాన్‌లాల్ అహ్మద్‌ఖాన్‌లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.