ఆమె వీడియోను పోర్న్‌సైట్లలో పోస్ట్‌ చేశాడు.. | A TV Sound technician harassing a lady | Sakshi
Sakshi News home page

ఆమె వీడియోను పోర్న్‌సైట్లలో పోస్ట్‌ చేశాడు..

Sep 12 2017 6:48 PM | Updated on Sep 19 2017 4:26 PM

ఆమె వీడియోను పోర్న్‌సైట్లలో పోస్ట్‌ చేశాడు..

ఆమె వీడియోను పోర్న్‌సైట్లలో పోస్ట్‌ చేశాడు..

ఓ యువతి ప్రైవేట్‌ వీడియోలను పోర్న్‌ వెబ్‌సైట్‌లలో పోస్టు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

సాక్షి,హైదరాబాద్‌: ఓ యువతి ప్రైవేట్‌ వీడియోలను పోర్న్‌ వెబ్‌సైట్‌లలో పోస్టు చేసి వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు  అరెస్టు చేశారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లాకు చెందిన పాటిబండ్ల సంజయ్‌ ఓ ప్రైవేట్‌ టీవీ ఛానల్‌లో సౌండ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తూ సికింద్రాబాద్‌ కార్ఖానలో నివాసముంటున్నాడు. ఎల్‌బీనగర్‌కు చెందిన బాధితురాలు మిర్యాలగూడలో ఓ టీవీ సీరియల్‌ షూటింగ్‌ను చూసేందుకు వచ్చిన సందర్భంలో సంజయ్‌తో పరిచయం ఏర్పడింది. మొబైల్‌ నంబర్లు మార్చుకొని తరచూ చాట్‌ చేసుకోవడం మొదలెట్టారు.
 
కొన్నిరోజుల తర్వాత  బాధితురాలిని మాటలతో కవ్వించి వీడియో చాట్‌ చేస్తున్న సమయంలో ప్రైవేట్‌ భాగాలు చూపించేలా చేశాడు. ఆమెకు తెలియకుండానే వీడియో క్యాప్చరింగ్‌ అప్లికేషన్‌ను ఉపయోగించి వీడియో ఫుటేజ్‌ను రికార్డు చేశాడు. ఆ తర్వాత తనతో ఉండాలని లేకపోతే ఆ వీడియోను పోర్న్‌ వెబ్‌సైట్‌లో పెడతానని బెదిరించాడు. అలా చేయవద్దంటూ ఆమె తీవ్రంగా మందలించింది. అయినప్పటికీ వివిధ పోర్న్‌ సైట్‌లలో సంజయ్‌ ఆ వీడియో పోస్టు చేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన  పోలీసులు సికింద్రాబాద్‌ కార్ఖానలో ఉన్న సంజయ్‌ను సోమవారం అరెస్టు చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఆ వీడియో లింక్‌లను తొలగించాలంటూ సంబంధిత వెబ్‌సైట్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement