బంకుల అక్రమాలపై 86 కేసులు | 86 cases filed on petrol bunks frauds | Sakshi
Sakshi News home page

బంకుల అక్రమాలపై 86 కేసులు

Mar 3 2014 12:03 PM | Updated on Sep 3 2019 9:06 PM

బంకుల అక్రమాలపై 86 కేసులు - Sakshi

బంకుల అక్రమాలపై 86 కేసులు

పెట్రోల్ బంకుల అవతవకలపై ఇప్పటి వరకు 86 కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు.

పెట్రోల్ బంకుల అవతవకలపై ఇప్పటి వరకు 86 కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రెస్సర్‌ వేన్‌ రిమోట్లను వాడుతున్న పంపులపై వంద కేసులు నమోదు చేశామన్నారు.

పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు సమ్మె దిగడం సబబు కాదని, నిబంధనలకు విరుద్ధంగా బంకులు కొనసాగిస్తే మాత్రం తమ దాడులు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఆయిల్‌ కంపెనీల పేర్లు చెప్పి పెట్రోల్ డీలర్లు తప్పించుకోవడం సరైనది కాదని లీగల్‌ మెట్రాలజీ అధికారులు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement