కుక్కలు వెంటపడగా పరుగెత్తిన చిన్నారి కిందపడి గాయాలతో మృతి చెందింది. ఈసీఐఎల్ ప్రాంతంలోని కాప్రాలోని యాదవకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాప్రా (హైదరాబాద్) : కుక్కలు వెంటపడగా పరుగెత్తిన చిన్నారి కిందపడి గాయాలతో మృతి చెందింది. ఈసీఐఎల్ ప్రాంతంలోని కాప్రాలోని యాదవకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన రంగారెడ్డి, అనూరాధ దంపతుల కుమార్తె సోని(7)గురువారం మధ్యాహ్నం రోడ్డు పక్కన నడిచి వెళుతోంది.
అదే సమయంలో పోట్లాడుకుంటున్న రెండు వీధి కుక్కలు ఆమె వెంటపడ్డాయి. దీంతో భయపడిన సోని పరుగుతీసింది. ఆక్రమంలో కిందపడిపోగా తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలించేలోగానే పాప మరణించింది. దాంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.