డెంగ్యూతో ఆరేళ్ల బాలిక మృతి | 6 years old girl dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో ఆరేళ్ల బాలిక మృతి

Sep 25 2016 6:02 PM | Updated on Sep 4 2017 2:58 PM

కంటోన్మెంట్ బోర్డు 3వవార్డు పరిధిలోని బాలంరాయి ఈద్గాలో ఆరేళ్ళ బాలిక ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధి బారిన పడి మృతి చెందింది.

రసూల్‌పురా (హైదరాబాద్‌ సిటీ) : కంటోన్మెంట్ బోర్డు 3వవార్డు పరిధిలోని బాలంరాయి ఈద్గాలో ఆరేళ్ళ బాలిక ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధి బారిన పడి మృతి చెందింది. స్థానికంగా నివాసం ఉండే ఖదీర్‌పాష, జూబీన్‌బేగంల ఆరేళ్ల కూతురు ఆసిఫా ఫాతిమా సికింద్రాబాద్‌లోని ఎంఎస్ క్రియేటివ్ స్కూల్‌లో ఒకటోతరగతి చదువుతున్నది.

మూడు రోజుల క్రితం ఫాతిమాకు తీవ్ర జ్వరం వచ్చింది. కార్ఖానలోని సౌమ్య ఆసుపత్రిలో చేర్పించారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూ వ్యాధి ఉన్నట్లు వైద్యులు తేల్చారు. దీంతో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్ళారు. ఆదివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement