హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 40,07,054 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
40 లక్షల ఓటర్లు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 40,07,054 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్ల ముసాయిదా జాబితాను గురువారం ఎన్నికల అధికారులు విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో 39,644,78 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఈనెల 12 వరకు 42వేల మందికి పైగా ఓటర్లుగా నమోదయ్యారు.
దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 40 లక్షలు దాటింది. ఇందులో 21,28,972 పురుష, 18,77,606 మహిళాఓటర్లతోపాటు 476 మంది ఇతర ఓటర్లుగా జాబితాలో ఉన్నారు. ఈ ముసాయిదా జాబితాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో, పోలింగ్ కేంద్రాల భవనాల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వచ్చేనెల 8వ తేదీ వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. 2015 జనవరి 5వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అదే నెల 15న ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.
సంక్షిప్తంగా షెడ్యూలు..
అంశం తేదీలు
ఓటర్ల ముసాయిదా జాబితా వెల్లడి నవంబర్ 13
అభ్యంతరాల స్వీకరణ నవంబర్13 - డిసెంబర్ 8
వార్డు సభల్లో ఓటర్ల వివరాలు వెల్లడి నవంబర్ 19, 26
ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నవంబర్ 16,23,30,
డిసెంబర్ 7 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం డిసెంబర్ 22
తాజా జాబితా తయారీ, కొత్త ఓటర్ల చేర్పు జనవరి 5
ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా జనవరి 15, 2015