నగరంలో 3620 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీ | 3620 Constable driver posts requirement in Hyderabad police department | Sakshi
Sakshi News home page

నగరంలో 3620 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీ

Feb 21 2015 3:20 AM | Updated on Mar 19 2019 5:52 PM

హైదరాబాద్ నగర పోలీసు విభాగంలో 3620 కానిస్టేబుల్‌డ్రైవర్ పోస్టుల నియామకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుమతించారు.

డీజీపీ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసు విభాగంలో 3620 కానిస్టేబుల్‌డ్రైవర్ పోస్టుల నియామకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుమతించారు. రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో నియామక ప్రకటన జారీ చేయనుంది. డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలు సమర్పించగా వాటిని యథాతథం గా ఆమోదించారు. నగర పోలీసు విభాగానికి ఇటీవల కొత్త వాహనాలను సమకూర్చిన నేపథ్యంలో అవసరమైన మేరకు డ్రైవర్ పోస్టుల భర్తీకి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పోలీసుశాఖ పరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలును సీఎం సమీక్షించారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ బృందాల పనితీరును కేసీఆర్ ప్రశంసించారు. నగరంలో పేకాట క్లబ్బులను మూసి వేయడంపట్ల సాధారణ ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం పేర్కొన్నారు.  తెలంగాణ పోలీసులు అన్ని అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement