హైటెక్ పద్దతిలో ఆర్ఆర్బి పేపర్ లీక్:34 మంది అరెస్ట్ | 34 people arrested in RRB Paper leak case | Sakshi
Sakshi News home page

హైటెక్ పద్దతిలో ఆర్ఆర్బి పేపర్ లీక్:34 మంది అరెస్ట్

Nov 30 2014 7:09 PM | Updated on Sep 2 2017 5:24 PM

హైటెక్ పద్దతిలో ఆర్ఆర్బి పేపర్ లీక్:34 మంది అరెస్ట్

హైటెక్ పద్దతిలో ఆర్ఆర్బి పేపర్ లీక్:34 మంది అరెస్ట్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) పేపర్ లీక్ చేసిన ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్:  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షను హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్ చేస్తున్న ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే క్వార్టర్స్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్న ముఠాని పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని 24 మందితోపాటు పరీక్ష రాసే 10 మంది అభ్యర్థులను అరెస్ట్ చేశారు.

ఈ పరీక్షకు చైతన్యపురి, దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్, సరూర్ నగర్లోని చైతన్య జూనియర్ కాలేజీ, తిరుమలగిరిలోని గౌతమి మోడల్ స్కూల్ కేంద్రాలుగా ఉన్నాయి. ఓ రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో ఈ మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష రాసే అభ్యర్థులు మెడలో తాయిత్తు రూపంలో డివైజ్, చెవిలో బ్లూటూత్తో మాస్ కాపీయింగ్ చేశారు. మాస్ కాపీయింగ్ చేస్తున్న పది మంది అభ్యర్థులను చైతన్యపురి, తిరుమలగిరిలలో ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 34 మందిని అరెస్ట్ చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement