ఇయర్‌రింగ్స్‌తో కుట్ర చేయొచ్చా? ట్రంప్‌-హారిస్‌ డిబేట్‌పై ఒకటే చర్చ | Conspiracy Theory On Kamala Harris Earrings | Sakshi
Sakshi News home page

ఇయర్‌రింగ్స్‌తో కుట్ర చేయొచ్చా? ట్రంప్‌-హారిస్‌ డిబేట్‌పై ఒకటే చర్చ

Sep 13 2024 1:48 PM | Updated on Oct 5 2024 1:55 PM

Conspiracy Theory On Kamala Harris Earrings

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లు తమ ప్రచారంతో దూసుకుతున్నారు. ఈ తరుణంలో  ఏబీసీ మీడియా నిర్వహించిన డిబేట్‌పై ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. డిబేట్‌లో ట్రంప్‌పై హారిస్‌పై చేయి సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ట్రంప్‌ మద్దతు దారులు హారిస్‌పై మండిపడుతున్నారు. కుట్రపూరితంగా కమలా హారిస్ తన ముత్యాల చెవిపోగుల ముసుగులో ఆడియో హెడ్‌ఫోన్‌లను వినియోగించారని మండిపడుతున్నారు. ట్రంప్‌ సైతం డిబేట్‌లో హారిస్‌ ఈ తరహా చెవిపోగులు ధరించడం అనవసరమన్నారు.  

కమలా హారిస్ తన ముత్యాల చెవిపోగుల ముసుగులో ఆడియో హెడ్‌ఫోన్‌లను వినియోగించారని  డిబేట్‌లో కలిగి ఉన్నారని వాదించిన ట్రంప్ మద్దతుదారులు ఎక్కువగా కుట్ర సిద్ధాంతాన్ని అనుసరించారు. ఆమె చెవిపోగులు నిజానికి ఐస్‌బాచ్ సౌండ్ సొల్యూషన్స్ నోవా హెచ్1 ఆడియో చెవిపోగులు అని ఊహాగానాలు వచ్చాయి, ఇది బ్లూటూత్ పరికరం ఆభరణాల వలె కనిపిస్తుంది.

 

ఈ నేపథ్యంలో టెక్‌ కంపెనీ ఐస్‌బాచ్ ఎండీ మాల్టే ఐవర్సెన్ స్పందించారు.హారిస్‌ మా ఉత్పత్తులలో ఒకదాన్ని ధరించారో లేదో మాకు తెలియదు.కానీ ఆమె ధరించిన ఇయర్‌రింగ్స్‌ బాగున్నాయని సెలవిచ్చారు. డిబేట్‌పై అనేక వాదనలు తెరపైకి వస్తున్నప్పటికీ టిఫనీ అండ్‌ కో అనే సంస్థ ఇయర్‌రింగ్స్‌ ధర సుమారు 800కి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఐస్‌బాచ్ విక్రయించే బ్లూటూత్‌ ధర సుమారు 625 డాలర్లుగా ఉంది.  

హారిస్ గతంలో బ్లూటూత్ ఇయర్‌పీస్‌ల వినియోగంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచార సమయంలో వైర్డు ఇయర్‌బడ్‌లను ఉపయోగించారు. ఇలా ప్రతి సారి ఆమె ధరించే ఆభరణాల చుట్టూ ఊహాగానాలు, రాజకీయ చర్చలు జరుగుతున్నాయి.  

కాగా, హారిస్‌ ట్రంప్‌ టీవీ డిబేట్‌, టేలర్ స్విప్ట్‌పై ఎలోన్ మస్క్ కామెంట్స్ చర్చ కొనసాగుతూనే ఉంది. నీల్సన్ డేటా ప్రకారం, ఏబీసీ మీడియా నిర్వహించిన డిబేట్‌ను 67.1 మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. 

ఇదీ చదవండి : మోదీ నా మంచి స్నేహితుడు : పుతిన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement