
ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్స్ టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. వాట్సప్ తరహా మెసేజింగ్ యాప్‌ను.. అందునా ఆఫ్‌లైన్‌లో పనిచేసేలా త్వరలో జనాలకు అందుబాటులోకి తేనున్నారు. దీనిపేరు.. బిట్‌చాట్. ఇంటర్నెట్‌తో అవసరం లేకుండా మెసేజ్‌లు పంపించుకునే ఈ యాప్ ఎలా పని చేస్తుందో ఓ లుక్కేద్దాం..
బిట్‌చాట్ అంటే అనే బ్లూటూత్‌తో పనిచేసే పీర్-టు-పీర్ వ్యవస్థ. సర్వర్లతో దీనికి పని ఉండదు. బ్లూటూత్ ఆన్‌లో ఉంటే సరిపోతుంది. బిట్‌చాట్ యూజర్లు ఏదైనా మెసేజ్ చేయాలంటూ బ్లూటూత్ ఆన్ చేసి మెసేజ్‌లు పంపుకోవచ్చు. ఇంటర్నెట్ సమస్యలు, ఇతర విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఘర్షణ వాతావారణ నెలకొన్న సమయాల్లో దీన్ని వినియోగించుకోవచ్చు. సర్వర్లు, అకౌంట్లు, ట్రాకింగ్ విధానాలు ఇందులో లేకపోవడంతో.. యూజర్లను విపరీతంగా ఆకట్టుకోవచ్చనే అంచనా వేస్తున్నారు.

ప్రైవసీకి ది బెస్ట్?
బిట్‌చాట్ అనే పేరుతో అందుబాటులోకి వచ్చిన ఆఫ్‌లైన్ మెసేజింగ్ యాప్‌లో యూజర్లు అవతల వ్యక్తికి పంపే ప్రతి మెసేజ్ ఎన్క్రిప్ట్ అవుతుంది. మెసేజ్ టూ మెసేజ్ మధ్యలో ఎలాంటి సర్వర్ వ్యవస్థ ఉండదు కాబట్టి యూజర్లకు భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని డోర్స్ అంటున్నారు.
సింపుల్‌గా.. డివైజ్ టూ డివైజ్ కనెక్షన్. ఫోన్‌లో బ్లూటూత్ ద్వారా బిట్‌చాట్ పనిచేస్తోంది
నో సెంట్రల్ సర్వర్: వాట్సప్,టెలిగ్రాం తరహా ఒక యూజర్‌కు పంపిన మెసేజ్ సర్వర్‌లోకి వెళుతుంది. సర్వర్ నుంచి రిసీవర్‌కు మెసేజ్ వెళుతుంది. బిట్‌చాట్‌లో అలా ఉండదు.. నేరుగా సెండర్‌నుంచి రిసీవర్‌కు మెసేజ్ వెళుతుంది.
మెష్ నెట్‌వర్కింగ్: బ్లూట్‌తో పనిచేసే ఈ బిట్‌చాట్ యాప్ ద్వారా రిసీవర్ సమీపంలో లేనప్పటికీ మెసేజ్ వెళుతుంది. ఈ టెక్నిక్‌ను మెష్ రూటింగ్ అంటారు ఇది మెసేజ్ బ్లూటూత్ పరిధికి మించి 300 మీటర్లు (984 అడుగులు) వరకు పంపడానికి వీలవుతుంది.
ప్రూప్స్ అవసరం లేదు: ఈ యాప్‌లో లాగిన్ అయ్యేందుకు ఎలాంటి వ్యక్తిగత యూజర్ వివరాలు అవసరం లేదు. అంటే ఫోన్ నెంబర్,ఈమెయిల్‌తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలతో పనిలేదు.
డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్ : బిట్‌చాట్ కొన్నిసార్లు పీట్ టూ పీర్ నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే సర్వర్ లేకుండా నెట్‌వర్క్‌లోని యూజర్ టూ యూజర్‌ల మధ్య డేటా మార్పిడి జరుగుతుంది.
పాస్‌వర్డ్ ప్రొటెక్షన్: గ్రూప్ చాట్స్‌ను ‘రూమ్‌లు’ అని పిలుస్తారు. ఇవి పాస్‌వర్డ్‌తో రక్షితంగా ఉంటాయి
యూజర్ ఇంటర్‌ఫేస్: యాప్‌ను ఇన్ స్టాల్ చేసి, అకౌంట్ క్రియేట్ చేస్తే చాలు. తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి ఎవరితోనైనా చాట్ చేసుకోవచ్చు.
గ్రూప్ చాట్స్ అండ్ రూమ్స్: హ్యాష్‌ట్యాగ్‌లతో పేర్లు పెట్టి, పాస్‌వర్డ్‌లతో సెక్యూర్ చేయవచ్చు.
ఉపయోగపడే సందర్భాలు:
రద్దీ ప్రదేశాల్లో నెట్‌వర్క్ సరిగ్గా పనిచేయని సమయంలో విపత్తుల సమయంలో (disaster zones). సెన్సార్ ఉన్న ప్రాంతాల్లో కమ్యూనికేట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బిట్‌చాట్ బీటా వెర్షన్‌లో టెస్ట్‌ఫ్లైట్ మోడ్‌లో ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
టెస్ట్ ఫ్లైట్ మోడ్ అనేది యాపిల్ అందించే బీటా టెస్టింగ్ ప్లాట్‌ఫారమ్. యాప్‌లను విడుదలకు ముందు దీని ద్వారా iOS, iPadOS, watchOS, tvOS పరీక్షించేందుకు డెవలపర్లు ఉపయోగించుకుంటారు. తద్వారా ఫీడ్‌బ్యాక్‌తో సంబంధిత యాప్‌ను ఎలా అంటే అలా మార్పులు చేర్పులు చేస్తారు.