breaking news
wahtsapp
-
వాట్సప్‌కు పోటీగా త్వరలో బిట్‌చాట్
ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్స్ టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. వాట్సప్ తరహా మెసేజింగ్ యాప్‌ను.. అందునా ఆఫ్‌లైన్‌లో పనిచేసేలా త్వరలో జనాలకు అందుబాటులోకి తేనున్నారు. దీనిపేరు.. బిట్‌చాట్. ఇంటర్నెట్తో అవసరం లేకుండా మెసేజ్‌లు పంపించుకునే ఈ యాప్ ఎలా పని చేస్తుందో ఓ లుక్కేద్దాం..బిట్‌చాట్ అంటే అనే బ్లూటూత్‌తో పనిచేసే పీర్-టు-పీర్ వ్యవస్థ. సర్వర్లతో దీనికి పని ఉండదు. బ్లూటూత్ ఆన్‌లో ఉంటే సరిపోతుంది. బిట్‌చాట్ యూజర్లు ఏదైనా మెసేజ్ చేయాలంటూ బ్లూటూత్ ఆన్ చేసి మెసేజ్‌లు పంపుకోవచ్చు. ఇంటర్నెట్ సమస్యలు, ఇతర విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఘర్షణ వాతావారణ నెలకొన్న సమయాల్లో దీన్ని వినియోగించుకోవచ్చు. సర్వర్లు, అకౌంట్లు, ట్రాకింగ్ విధానాలు ఇందులో లేకపోవడంతో.. యూజర్లను విపరీతంగా ఆకట్టుకోవచ్చనే అంచనా వేస్తున్నారు.ప్రైవసీకి ది బెస్ట్?బిట్‌చాట్ అనే పేరుతో అందుబాటులోకి వచ్చిన ఆఫ్‌లైన్ మెసేజింగ్ యాప్‌లో యూజర్లు అవతల వ్యక్తికి పంపే ప్రతి మెసేజ్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. మెసేజ్ టూ మెసేజ్ మధ్యలో ఎలాంటి సర్వర్ వ్యవస్థ ఉండదు కాబట్టి యూజర్లకు భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని డోర్స్ అంటున్నారు. సింపుల్‌గా.. డివైజ్ టూ డివైజ్ కనెక్షన్. ఫోన్లో బ్లూటూత్ ద్వారా బిట్‌చాట్ పనిచేస్తోంది నో సెంట్రల్ సర్వర్: వాట్సప్,టెలిగ్రాం తరహా ఒక యూజర్‌కు పంపిన మెసేజ్ సర్వర్లోకి వెళుతుంది. సర్వర్ నుంచి రిసీవర్‌కు మెసేజ్ వెళుతుంది. బిట్‌చాట్‌లో అలా ఉండదు.. నేరుగా సెండర్‌నుంచి రిసీవర్‌కు మెసేజ్ వెళుతుంది. మెష్ నెట్వర్కింగ్: బ్లూట్‌తో పనిచేసే ఈ బిట్‌చాట్ యాప్ ద్వారా రిసీవర్ సమీపంలో లేనప్పటికీ మెసేజ్ వెళుతుంది. ఈ టెక్నిక్‌ను మెష్ రూటింగ్ అంటారు ఇది మెసేజ్ బ్లూటూత్ పరిధికి మించి 300 మీటర్లు (984 అడుగులు) వరకు పంపడానికి వీలవుతుంది. ప్రూప్స్ అవసరం లేదు: ఈ యాప్‌లో లాగిన్ అయ్యేందుకు ఎలాంటి వ్యక్తిగత యూజర్ వివరాలు అవసరం లేదు. అంటే ఫోన్ నెంబర్,ఈమెయిల్‌తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలతో పనిలేదు. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ : బిట్‌చాట్ కొన్నిసార్లు పీట్ టూ పీర్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే సర్వర్ లేకుండా నెట్‌వర్క్‌లోని యూజర్ టూ యూజర్ల మధ్య డేటా మార్పిడి జరుగుతుంది. పాస్వర్డ్ ప్రొటెక్షన్: గ్రూప్ చాట్స్‌ను ‘రూమ్‌లు’ అని పిలుస్తారు. ఇవి పాస్‌వర్డ్‌తో రక్షితంగా ఉంటాయియూజర్ ఇంటర్ఫేస్: యాప్‌ను ఇన్ స్టాల్ చేసి, అకౌంట్ క్రియేట్ చేస్తే చాలు. తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి ఎవరితోనైనా చాట్ చేసుకోవచ్చు. గ్రూప్ చాట్స్ అండ్ రూమ్స్: హ్యాష్‌ట్యాగ్‌లతో పేర్లు పెట్టి, పాస్‌వర్డ్‌లతో సెక్యూర్ చేయవచ్చు. ఉపయోగపడే సందర్భాలు: రద్దీ ప్రదేశాల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయని సమయంలో విపత్తుల సమయంలో (disaster zones). సెన్సార్ ఉన్న ప్రాంతాల్లో కమ్యూనికేట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బిట్‌చాట్ బీటా వెర్షన్లో టెస్ట్‌ఫ్లైట్ మోడ్‌లో ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.టెస్ట్ ఫ్లైట్ మోడ్ అనేది యాపిల్ అందించే బీటా టెస్టింగ్ ప్లాట్‌ఫారమ్. యాప్‌లను విడుదలకు ముందు దీని ద్వారా iOS, iPadOS, watchOS, tvOS పరీక్షించేందుకు డెవలపర్లు ఉపయోగించుకుంటారు. తద్వారా ఫీడ్‌బ్యాక్‌తో సంబంధిత యాప్‌ను ఎలా అంటే అలా మార్పులు చేర్పులు చేస్తారు. -
వాట్సాప్, ఫేస్బుక్ నియంత్రణపై చర్చలు - త్వరలో కొత్త రూల్స్!
ప్రస్తుతం వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ లేకుండా యువతకు సమయమే గడచిపోదు. అయితే వీటిని కొంత మంది మంచి పనుల కోసం ఉపయోగిస్తే.. మరికొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి అనుచిత సంఘటనకు సంబంధించిన కేసులు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఎంతోమంది అకౌంట్స్ కూడా బ్లాక్ చేసింది. అయితే ఇప్పుడు వీటిపైన కొన్ని నియంత్రణలు కల్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం.. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లను నియంత్రించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులలో కమ్యూనికేషన్ యాప్స్ మీద కొంత సమయం లేదా తాత్కాలిక నిషేధం విధించాల్సిన అవసరం ఉందా.. లేదా అనే విషయం మీద చర్చలు మొదలుపెట్టింది. ఇంటర్నెట్ బేస్డ్ కాల్స్ విషయంలో టెలికామ్ ప్రొవైడర్లకు వర్తించే నియమాలు కమ్యూనికేషన్ యాప్స్‌కి కూడా వర్తించేలా చేయాలని సంస్థలు ఎప్పటి నుంచో అడుగుతున్నాయి, అంతే కాకుండా లైసెన్స్ ఫీజులమీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంగా టెలికామ్ విభాగం 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా'ను సంప్రదించింది. దీంతో ట్రాయ్ యాప్స్ నియంత్రణ, తాత్కాలిక నిషేధం వంటి 14 అంశాల మీద చర్చలు జరపనుంది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) వాట్సాప్, టెలిగ్రామ్ మొదలైన వాటికి పూర్తిగా నిషేధించే బదులు అత్యవసర పరిస్థితుల్లో చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా యాప్‌లలో ఆర్థిక, భద్రత పరమైన అంశాలను తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉందని ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. -
వేధిస్తే... వాట్సాప్ పంపుడే!
పోకిరీలపై ఫిర్యాదు చేస్తున్న బాధితులు సగానికిపైగా ఫిర్యాదులు వాట్సాప్ ద్వారానే.. త్వరగా స్పందిస్తున్న సైబరాబాద్ షీ టీమ్స్ సిటీబ్యూరో: పోకిరీల ఈవ్‌టీజింగ్‌పై ఫిర్యాదు చేస్తే ఎక్కడ పరువుపోతుందోనని.. ఒకవేళ ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా ఎన్నిసార్లు ఠాణా చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తుందోననే దిగులుతో బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు... ఇదంతా గతం. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులు మహిళలను చైతన్యపరుస్తున్నాయి. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన షీ బృందాల పుణ్యమా అని ఈవ్‌టీజర్లపై ఫిర్యాదు చేసే బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వేధింపులకు గురైన క్షణంలోనే బాధిత మహిళలు పోలీసుస్టేషన్ గడప తొక్కకుండానే అరచేతిలో ఉన్న మొబైల్ సహాయంతో వాట్సాప్ ద్వారా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444కు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు వచ్చిన 376 ఫిర్యాదుల్లో దాదాపు 200 ఫిర్యాదులు వాట్సాప్ ద్వారానే రావడం విశేషం. ఒక్క ఎస్ఎంఎస్తో రంగంలోకి ... అభయ ఘటన తర్వాత సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రత కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సైబరాబాద్‌లోని శంషాబాద్, మాదాపూర్, బాలానగర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్లలో ఏడాదిన్నర క్రితం ఏర్పాటుచేసిన 60 షీ టీమ్స్ తమ పనిని నిశ్శబ్దంగా చేసుకుపోతున్నాయి. కళాశాలలు, బస్సుస్టాప్‌లు, బస్సులు, రైల్వే స్టేషన్లు, కార్యాలయాల్లో యువతులు, మహిళలను వేధించేవారిపై నిఘా ఉంచుతున్నాయి. సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నంబర్ 9490617444కు బాధిత యువతులు ఎస్ఎంఎస్ పంపిన మరుక్షణం షీ టీమ్స్ స్పందించి ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. ఈవ్టీజర్ల వెకిలి చేష్టలను చిత్రీకరించి సాక్ష్యాలు పట్టుకొని షీ కార్యాలయానికి తరలిస్తున్నారు. వేధించేవాళ్లలో విద్యార్థులు, యువకులు ఉంటే వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని మరోమారు ఇలాంటి చర్యలకు పాల్పడబోమంటూ లిఖితపూర్వకంగా రాయించుకొని పెట్టీ కేసులు పెడుతున్నారు. మళ్లీ అదే తప్పు చేసే వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. టెక్నాలజీతో ఈవ్‌టీజర్లపై ఫిర్యాదు ఈవ్‌టీజింగ్, వేధింపులకు గురయ్యే మహిళలు చాలా మంది సైబరాబాద్ వాట్సాప్ నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 376 కేసులు నమోదు చేశాం. వీటిలో 309 పెట్టీ కేసులు, 67 ఎఫ్‌ఐఆర్‌లున్నాయి. ఈ కేసుల్లో మొత్తం 427 మందిని పట్టుకున్నాం. వీరిలో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న 314 మంది ఉన్నారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు 51 మంది, 40 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు 18 మంది, 21 మంది మైనర్లు ఉన్నారు. 50కి పైబడినవారు ఐదుగురున్నారు. వీరందరికీ కౌన్సెలింగ్ నిర్వహించాం. మరోమారు వేధింపులకు పాల్పడవద్దని సుతిమెత్తగా హెచ్చరించాం. -శ్రీనివాసులు, ఏసీపీ, సైబరాబాద్ షీ టీ మ్స్ ఇన్చార్జి