తల్లి ఇద్దరు కూతుళ్ల అదృశ్యం | 3 womens are missing in gachibowli | Sakshi
Sakshi News home page

తల్లి ఇద్దరు కూతుళ్ల అదృశ్యం

Jun 4 2017 11:46 AM | Updated on Sep 5 2017 12:49 PM

తల్లీ ఇద్దరు కూతుళ్లు అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

గచ్చిబౌలి: తల్లీ ఇద్దరు కూతుళ్లు అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భూపతి తెలిపిన వివరాలు ప్రకారం మసీద్‌బండలో ఎస్‌ఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌లో కూలీలుగా పనిచేసే నీలం ఇద్రమ్మ (35) ఆమె ఇద్దరు కుమార్తెలు రాధ(10), ప్రేమలత(6) మే 29 సాయంత్రం 6 గంటలకు బాత్‌రూమ్‌కు వెళుతున్నామని చెప్పి బయటకు వెళ్లారు. వారు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు సమీప ప్రాంతాల్లో ఎంత వెతికినా అచూకీ లభ్యం కాలేదు.  భర్త చిన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement