29, 30న ‘కేంద్రీయ’లో ఇంటర్వ్యూలు | 29, 30, 'central' in the interviews | Sakshi
Sakshi News home page

29, 30న ‘కేంద్రీయ’లో ఇంటర్వ్యూలు

Mar 22 2016 4:32 AM | Updated on Aug 20 2018 6:18 PM

2016-17 విద్యా సంవత్సరానికి గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించను న్నట్టు ప్రిన్సిపల్ పీఎస్ రాజు తెలిపారు.

హైదరాబాద్: 2016-17 విద్యా సంవత్సరానికి గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించను న్నట్టు ప్రిన్సిపల్ పీఎస్ రాజు తెలిపారు. 29న ప్రైమరీ టీచర్స్, డాక్టర్, స్టాఫ్ నర్స్, యోగా టీచర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, డ్యాన్స్ కోచ్, స్పోర్ట్స్ కోచ్, క్య్రాప్ట్స్ టీచర్, పీఆర్‌టీ మ్యూజిక్, టీజీటీ ఫిజికల్ హెల్త్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. 30న పీజీటీ ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, భౌతిక, రసాయన, జీవశాస్త్రం, గణితం, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్, టీజీటీ హిందీ, కంప్యూటర్ ఇన్స్‌స్ట్రక్టర్, అడిషనల్ లాంగ్వేజెస్ టీచర్స్ తెలుగు, జర్మనీ, ఫ్రెంచ్ టీచర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement