breaking news
Health education
-
ఆరోగ్య విద్యపై అవగాహన సదస్సు
జమ్ము (విజయనగరం రూరల్) : మున్సిపాలిటీ పరిధిలోని జమ్ము ప్రాథమిక పాఠశాలలో స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యవిద్యపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాకోడు పీహెచ్సీ వైద్య పర్యవేక్షకుడు కేబీవీ సత్యనారాయణ వేసవిలో అంటువ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అలాగే వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శశికళ, మంత్రి రామ్మోహనరావు, అనురాధ, సీఆర్పీ కృష్ణ, తిరుమల నర్సింగ్‌హోమ్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
29, 30న ‘కేంద్రీయ’లో ఇంటర్వ్యూలు
హైదరాబాద్: 2016-17 విద్యా సంవత్సరానికి గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించను న్నట్టు ప్రిన్సిపల్ పీఎస్ రాజు తెలిపారు. 29న ప్రైమరీ టీచర్స్, డాక్టర్, స్టాఫ్ నర్స్, యోగా టీచర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్, డ్యాన్స్ కోచ్, స్పోర్ట్స్ కోచ్, క్య్రాప్ట్స్ టీచర్, పీఆర్టీ మ్యూజిక్, టీజీటీ ఫిజికల్ హెల్త్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. 30న పీజీటీ ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, భౌతిక, రసాయన, జీవశాస్త్రం, గణితం, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్, టీజీటీ హిందీ, కంప్యూటర్ ఇన్స్స్ట్రక్టర్, అడిషనల్ లాంగ్వేజెస్ టీచర్స్ తెలుగు, జర్మనీ, ఫ్రెంచ్ టీచర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.