చిలకలగూడ రైల్వేక్వార్టర్స్ కలుషిత నీరు తాగి 138 మంది అస్వస్థతకు గురయ్యారు.
చిలకలగూడ రైల్వేక్వార్టర్స్ కలుషిత నీరు తాగి 138 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగిన వీరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఇందులో 40 మంది చిన్నారులు కూడా ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితులను మెట్టుగూడ రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలాన్ని రైల్వే అధికారులు పరిశీలించారు.