డీఈవో కార్యాలయంపై తల్లిదండ్రుల దాడి | 10th fail students parents attacked DEO office in hyderabad | Sakshi
Sakshi News home page

డీఈవో కార్యాలయంపై తల్లిదండ్రుల దాడి

May 19 2015 2:28 PM | Updated on Sep 3 2017 2:19 AM

పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రలు ఆందోళన రెండోరోజు కూడా కొనసాగుతోంది. కావాలనే మార్కులు తక్కువగా వేసి విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యేందుకు కారణం అయ్యారంట..

హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రలు ఆందోళన రెండోరోజు కూడా కొనసాగుతోంది. కావాలనే మార్కులు తక్కువగా వేసి విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళవారం హైదరాబాద్ డీఈవో కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అన్ని సబ్జెక్ట్ల్లో పాసయిన తమ పిల్లలు మ్యాథ్స్,  ఫిజిక్స్లోనే ఎందుకు తప్పారో చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని వారు డిమాండ్ చేశారు.

మరోవైపు ఫెయిల్ అయిన పదో తరగతి విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. బట్టీ విధానంతో పాటు, కాపీయింగ్కు ఆస్కారం లేకుండా  సీసీఈ విధానం అమలు చేశామన్నారు. అయితే విద్యార్థులు ఆ విధానాన్ని అలవాటు పడాల్సి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement