తిరుపతి పట్టణంలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతి: తిరుపతి పట్టణంలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్ సమీపంలో పార్టీ నాయకులు బంద్ చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. షాపులు, వ్యాపార సంస్థలు స్వచ్ఛంధంగా మూతపడ్డాయి.