ఆస్తి కోసం సొంత అన్నను కిరాతకంగా హతమార్చి ఇంట్లోనె పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆస్తి కోసం సొంత అన్నను కిరాతకంగా హతమార్చి ఇంట్లోనె పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వైఎస్సార్‌కడప జిల్లా సింహాద్రిపురం మండలం మిథునాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగాధర్‌రెడ్డి(43), పెద్ది రెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తికి సంబంధించిన విషయంలో వివాదాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం పెద్దిరెడ్డి అన్నపై దాడి చేసి కర్రలతో చితకబాది హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనె పూడ్చి పెట్టాడు. గంగాధర్‌రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.