29న విజ్ఞాన్‌ వర్సిటీ స్నాతకోత్సవం | Vigyan Varsity Graduation Ceremony on 29th | Sakshi
Sakshi News home page

29న విజ్ఞాన్‌ వర్సిటీ స్నాతకోత్సవం

Jul 27 2017 3:42 AM | Updated on Sep 5 2017 4:56 PM

విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవం ఈనెల 29న నిర్వహిస్తున్నట్లు ఉప కులపతి ఎం.వై.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు.

► ఇస్రో చైర్మన్‌ కిరణ్‌కుమార్, దర్శకుడు కె.విశ్వనాథ్‌లకు డాక్టరేట్లు

చేబ్రోలు: విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవం ఈనెల 29న నిర్వహిస్తున్నట్లు ఉప కులపతి ఎం.వై.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ వర్సిటీలో మంగళవారం విలేకరులతో ప్రసాద్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు స్నాతకోత్సవా నికి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్, ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్, కోయంబత్తూరులోని అరవింద్‌ కంటి ఆస్పత్రి చీఫ్‌ పీడియాట్రిక్‌ ఆప్తమాలజిస్టు డాక్టర్‌ కల్పనా నరేంద్రన్‌ గౌరవ అతిథులుగా హాజరవుతారని, వారికి గౌరవ డాక్టరేట్లు ప్రదా నం చేస్తున్నట్లు వెల్లడించారు. స్నాతకోత్సవం సందర్భంగా 1,114 మంది విద్యార్థులకు డిగ్రీలు, 20మందికి బంగారు పతకాల ప్రదానం ఉంటుందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement