'రోహిత్ ఘటన మా పరిధిలోకి రాదు' | telangana home minister nayani narasimha reddy comments on rohith suicide | Sakshi
Sakshi News home page

'రోహిత్ ఘటన మా పరిధిలోకి రాదు'

Jan 30 2016 2:02 PM | Updated on Oct 20 2018 5:03 PM

హెచ్‌సీయూలో స్కాలర్ విద్యార్థి రోహిత్ ఆత్యహత్య ఘటన తమ పరిధిలోకి రాదని దానికి సంబంధించి కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని..l.

హైదరాబాద్: హెచ్‌సీయూలో స్కాలర్ విద్యార్థి రోహిత్ ఆత్యహత్య ఘటన తమ పరిధిలోకి రాదని దానికి సంబంధించి కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హెచ్‌సీయూలో ఘటనలో తలదూర్చి చేతులు కాల్చుకోదల్చుకోవడం లేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ ఘటనపై సీబీసీఐడీ విచారణకు సిఫారసు చేశామన్నారు. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement