శేషాచలం అడవుల్లోని ఈతగుంట ప్రాంతం వద్ద ఏపీ టాస్క్‌ఫోర్సు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.
పోలీసులపై స్మగ్లర్ల రాళ్లదాడి
Jan 20 2017 8:36 AM | Updated on Aug 20 2018 7:27 PM
తిరుపతి: శేషాచలం అడవుల్లోని ఈతగుంట ప్రాంతం వద్ద ఏపీ టాస్క్‌ఫోర్సు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు తారసపడ్డారు. వారిని పట్టుకోవడానికి వెంబడించగా ప్రతిగా స్మగ్లర్లు రాళ్ల దాడి చేశారు. రాళ్లదాడిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న పోలీసులు ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి బియ్యం, నిత్యావసరాలు, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. పరారైన 30 మంది స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.
Advertisement
Advertisement