మణికొండలో షార్ట్‌సర్క్యూట్: రూ.కోటి నష్టం | short circuit In the manikonda | Sakshi
Sakshi News home page

మణికొండలో షార్ట్‌సర్క్యూట్: రూ.కోటి నష్టం

Feb 22 2016 12:39 PM | Updated on Sep 4 2018 5:07 PM

మణికొండ పంచాయతీ పరిధి మణికొండ గార్డెన్ కాలనీలో సోమవారం ఉదయం సోమవారం షార్ట్ సర్క్యూట్ సంభవించింది.

మణికొండ పంచాయతీ పరిధి మణికొండ గార్డెన్ కాలనీలో సోమవారం ఉదయం సోమవారం షార్ట్ సర్క్యూట్ సంభవించింది. 11కేవీ వైరు తెగి మరో వైర్‌పై పడటంతో కాలనీలోని దాదాపు వంద ఇళ్లలో విద్యుత్ ఉపకరణాలు కాలిపోయాయి. వైరింగ్‌తోపాటు టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు కూలర్లు, మీటర్లు, ఫ్యాన్లు దగ్దమై పోవటంతో కోటి మేర నష్టం వాట్లిందని స్థానికులు తెలిపారు. కాలనీలోని పాఠశాలలో వైర్లు కాలటంతో భయంతో విద్యార్థులు పరుగులు తీశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement