శ్రీవారి సేవలో ‘రుద్రమదేవి’ | rudramadevi movie team visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ‘రుద్రమదేవి’

Oct 7 2015 11:18 AM | Updated on Sep 3 2017 10:35 AM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని బుధవారం ఉదయం ‘రుద్రమదేవి’ చిత్ర బృందం దర్శించుకుంది.

తిరుమల: కలియుగ దైవం  శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని బుధవారం ఉదయం ‘రుద్రమదేవి’  చిత్ర బృందం దర్శించుకుంది. చిత్ర దర్శకుడు గుణశేఖర్, హీరోయిన్ అనుష్కలతో పాటు పలువురు యూనిట్ సభ్యులు వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 9 న రుద్రమదేవి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సినిమా మొదటి కాపీని శ్రీవారి పాదాల ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీస్పులు తీసుకున్నట్టు వారు తెలిపారు. హీరోయిన్ అనుష్కను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement