సత్తెనపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య | lovers commits suicide in guntur district | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య

Nov 4 2015 9:15 AM | Updated on Nov 6 2018 7:56 PM

తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు.

సత్తెనపల్లి: తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. కలిసి బతకలేక పోయినా చావులోనైనా కలిసే ఉందామని నిర్ణయించుకున్న ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా ప్రియుడు అక్కడికక్కడే మృతిచెందగా, ప్రియురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలెం గ్రామ శివారులోని పంట కాలువ వద్ద బుధవారం తెల్లవారుజామున వెలుగు చూసింది.

వివరాలు.. ముప్పాళ్ల మండలం తొండపి గ్రామానికి చెందిన ఎర్ర శ్రీకాంత్(22), అచ్చంపేట మండలం గ్రందసిరి గ్రామానికి చెందిన భువనేశ్వరి(19)  ప్రేమించుకున్నారు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు చదువు మానిపించి ఇంటికే పరిమితం చేశారు. కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు తమ పెళ్లికి ఒప్పుకోరని నిర్ణయించుకున్న ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని  నిర్ణయించుకున్నారు. దీనికోసం ఇద్దరు మంగళవారం రాత్రి రెంటపాలెం చేరుకొని వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు.

దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. భువనేశ్వరి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు ఆమెను సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భువనేశ్వరి కొద్ది సేపటి క్రితం మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement