సుప్రీం కోర్టుకు కట్జూ క్షమాపణ | Justice Katju tenders unconditional apology in apex court | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టుకు కట్జూ క్షమాపణ

Jan 6 2017 7:16 PM | Updated on Sep 2 2018 5:28 PM

సుప్రీం కోర్టుపై చేసిన ధిక్కార వ్యాఖ్యలకు మార్కండేయ కట్జూ క్షమాపణ తెలిపారు.

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టుపై చేసిన ధిక్కార వ్యాఖ్యలకు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తన బ్లాగులో బేషరతుగా క్షమాపణ తెలిపారు. దీనికి ఆమోదించిన సర్వోన్నత న్యాయస్థానం కట్జూపై కేసు విచారణను ఆపివేయాలని నిర్ణయించింది. శుక్రవారం న్యాయమూర్తులు రంజన్ గోగోయ్, యూయూ లలిత్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.


సుప్రీం కోర్టుకు కట్జూ క్షమాపణలు చెప్పినందున, దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆయనపై నమోదైన కోర్టు ధిక్కార కేసును తక్షణం మూసివేసిందని సీనియర్ న్యాయవాది రాజీవ్ దవన్ చెప్పారు. కట్జూ తరఫున ఆయన కోర్టుకు హాజరయ్యారు. కాగా వ్యక్తిగత హాజరు నుంచి కట్జూకు కోర్టు గతంలో మినహాయింపు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement