మంచినీటి పైపుల్లో మురికినీళ్లు | Dirty water in drinking water pipes | Sakshi
Sakshi News home page

మంచినీటి పైపుల్లో మురికినీళ్లు

Feb 14 2016 10:48 AM | Updated on Oct 9 2018 4:48 PM

రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లోని బొమ్మన బ్రదర్స్ కాలనీలో గత కొంత కాలంగా మంచినీటి పైపుల్లో మురికినీళ్లు వస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లోని బొమ్మన బ్రదర్స్ కాలనీలో గత కొంత కాలంగా మంచినీటి పైపుల్లో మురికినీళ్లు వస్తున్నాయి. మంజీరా నీళ్లు సరఫరా అయ్యే పైపుల్లో మురికినీళ్లు రావడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయం ఆదివారం తీసుకెళ్లారు. తాను సంబంధిత అధికారులతో మాట్లాడతాని ఆయన హామీ ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement