ఎమ్మార్వోపై వేటు | collector lokesh kumar suspended to mro | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వోపై వేటు

Aug 5 2017 2:52 PM | Updated on Mar 21 2019 8:22 PM

నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి పేరిటి రిజిస్ర్టేషన్‌ చేసిన ఎమ్మార్వోపై వేటు పడింది.

ఎర్రుపాలెం: నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి పేరిటి రిజిస్ర్టేషన్‌ చేసిన ఎమ్మార్వోపై వేటు పడింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల తహశీల్దార్‌ మాధవి అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో ఆమెపై వేటు వేశారు. మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన ఐదెకరాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆమెతో పాటు గ్రామ వీఆర్వో ఎంవీఎస్‌ చారీని సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ లోకేష్‌ కుమార్‌ శనివారం ఆదేశాలు జారీచేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement