కృత్రిమ ఇసుక తయారీ స్థావరాలపై దాడులు | Artificial sand making centers seized | Sakshi
Sakshi News home page

కృత్రిమ ఇసుక తయారీ స్థావరాలపై దాడులు

Jan 11 2016 7:25 PM | Updated on Mar 28 2018 11:26 AM

శామీర్‌పేట్ మండలంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా కృత్రిమ ఇసుక తయారుచేస్తున్నారన్న పక్కా సమాచారంతో సోమవారం కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు.

శామీర్‌పేట్ (రంగారెడ్డి) : శామీర్‌పేట్ మండలంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా కృత్రిమ ఇసుక తయారుచేస్తున్నారన్న పక్కా సమాచారంతో సోమవారం కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో పలు వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. శామీర్‌పేట్ సీఐ సత్తయ్య మాట్లాడుతూ...మండలంలోని శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్ లిమిట్స్‌లో కృత్రిమ ఇసుక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడుల్లో కృత్రిమ ఇసుక తయారుచేస్తున్న స్థావరాలను ధ్వంసం చేయడంతోపాటు వినియోగిస్తున్న పరికరాలను, నాలుగు ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేసినట్లు తెలిపారు. కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నవారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement