ఓ చేతితో సెల్ఫీ.. మరో చేతితో స్టీరింగ్! | Car Road Accident In Shamirpet Area Hyderabad | Sakshi
Sakshi News home page

ఓ చేతితో సెల్ఫీ.. మరో చేతితో స్టీరింగ్!

May 29 2026 12:30 PM | Updated on May 29 2026 12:39 PM

Car Road Accident In Shamirpet Area Hyderabad

పల్టీలు కొట్టిన కారు

వాహనంలోని యువకుడి దుర్మరణం

వీడియో తీస్తున్న క్రమంలో అదుపుతప్పిన కారు

మేడ్చల్‌రూరల్‌: అతివేగం, ఫోన్‌లో సెల్ఫీ వీడియో ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన గురువారం శామీర్‌పేట్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన మహమ్మద్‌ రెహాన్, మిత్రుడు ఎం.డి.అహ్మద్‌. వీరి స్నేహితుడు దినేష్‌రెడ్డి కారులో పెట్రోల్‌ పోయించేందుకు కొల్తూరు గ్రామానికి వెళ్లారు.

కారును దినేష్‌రెడ్డి నడుపుతుండగా పక్క సీటులో మహమ్మద్‌ రెహాన్‌ (18), వెనక సీటులో అహ్మద్‌ కూర్చున్నారు. పెట్రోల్‌ బంక్‌లో స్టాక్‌ లేదని తెలుసుకుని తిరిగి ఇంటికి వస్తున్నారు. దినేష్‌ రెడ్డి కారును వేగంగా నడుపుతూ సెల్ఫీ వీడియో తీస్తున్న క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్తుండగా రెహాన్‌ గమనించి హ్యాండ్‌బ్రేక్‌ను ఒక్కసారిగా లాగాడు. దీంతో కారు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో రెహాన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దినేష్‌రెడ్డి, అహ్మద్‌లకు గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement