breaking news
Artificial sand
-
సర్కారీ పనుల్లో 50% రాతి ఇసుక!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిపే నిర్మాణ పనుల్లో 50 శాతం కృత్రిమ ఇసుక (రాతి ఇసుక) వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిం చింది. సిమెంట్ కాంక్రీట్ మిశ్రమాలతోపాటు ఇసుకతో చేపట్టే అన్ని రకాల నిర్మాణ పనుల్లో కృత్రిమ ఇసుక, సహజ ఇసుకను 50:50 నిష్పత్తిలో వినియోగించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లు, భవనాల శాఖ, నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. సహజవనరుల వినియోగంపై నియం త్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. నదుల్లో ఇసుక కొరత పెరుగుతుండటంతో కృత్రిమ ఇసుక వినియోగం ప్రోత్సహించాలని నిర్ణయించారు. కృత్రిమ ఇసుక మన్నికపై అనుమానం లేదు నేషనల్ కౌన్సిల్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్(ఎన్సీపీబీ ఎం), నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్)తో పాటు జేఎన్టీయూ హైదరాబాద్‌లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ‘బీఐసీఏఆర్డీ’ పేరుతో నిర్వహిస్తున్న శాస్త్రీయ పరిశోధన ప్రయోగశాల కృత్రిమ ఇసుక మన్నిక, దృఢత్వాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్లు జారీ చేశాయని సీఎస్ తెలిపారు. దీంతో కృత్రిమ ఇసుక ఉత్పత్తి, వినియోగానికి డిమాండ్ పెరిగిందన్నారు. దీంతో సాంకేతికంగా కృత్రిమ ఇసుక మన్నిక విషయంలో సందేహాలు అనవసరమన్నారు. -
కృత్రిమ ఇసుక తయారీ స్థావరాలపై దాడులు
శామీర్‌పేట్ (రంగారెడ్డి) : శామీర్‌పేట్ మండలంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా కృత్రిమ ఇసుక తయారుచేస్తున్నారన్న పక్కా సమాచారంతో సోమవారం కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో పలు వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. శామీర్‌పేట్ సీఐ సత్తయ్య మాట్లాడుతూ...మండలంలోని శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ లిమిట్స్‌లో కృత్రిమ ఇసుక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడుల్లో కృత్రిమ ఇసుక తయారుచేస్తున్న స్థావరాలను ధ్వంసం చేయడంతోపాటు వినియోగిస్తున్న పరికరాలను, నాలుగు ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేసినట్లు తెలిపారు. కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నవారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు.