బీర్కూర్‌లో పేలిన సిలిండర్: నలుగురికి గాయాలు | 4 injured in gas cylinder blast at nizamabad district | Sakshi
Sakshi News home page

బీర్కూర్‌లో పేలిన సిలిండర్: నలుగురికి గాయాలు

Dec 11 2015 11:33 AM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లాలో బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది.

బీర్కూర్ : నిజామాబాద్ జిల్లాలో బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోచారం కాలనీకి చెందిన గంగవ్వ అనే మహిళ ఇంట్లో గ్యాస్ స్టవ్ రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తూ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో గంగవ్వ(60) కు తీవ్రగాయాలు కాగా, పీరవ్వ(35), సాయికృష్ణ(40), గంగామణి(8) అనే ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement