ప్రతికూల ప్రచారం తప్ప గత్యంతరం లేదా?

Aakar Patel writes on Gujarat elections - Sakshi

అవలోకనం

వార్తా ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అన్ని, లేదా దాదాపు అన్ని వార్తా కథనాలూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మీడియా మద్దతుతో బీజేపీ ప్రచారంలో ప్రవేశపెట్టినవేనని కనబడుతూనే ఉంది. బీజేపీ సాగిస్తున్నది దూషణలు, భయాలతో కూడిన ప్రతికూల ప్రచారం. 2014లో వలే సుపరిపాలన, అచ్చేదిన్‌ నినాదాలతో సానుకూల ప్రచారాన్ని చే యాలన్న కోరికే దానికి లేకపోవడం నేడు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న విషయం. ఇది దురదృష్టకరం. ఉపఖండంలో రాజకీయాలు సాగే పద్ధతి కూడా ఇదే.

మణిశంకర్‌ అయ్యర్‌ ఏదో అన్నంత మాత్రాన అదో సమస్యగా, గుజరాత్‌ ఎన్ని కల సమస్యగా మారుతుందని ఎవరు అనుకుంటారు? నేనైతే కచ్చితంగా అనుకో లేదు. గజరాతీలు తమకేమీ సంబంధంలేనిదిగా భావించే ఈ అంశం గుజరాత్‌ ఎన్నికల్లో చెప్పుకోదగినంత పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోవడం లేదు కూడా. అయ్యర్‌ వాడిన అప్రతిష్టాకరమైన పదం గురించి నేను గుజరాతీ నిఘం టువును శోధించాను. ‘నీచ్‌’కు గుజరాతీ అనువాదం ‘దుష్ట్‌’. ఇంగ్లిష్‌ అనువాదాలు ‘వంచనాత్మక’, ‘దుష్ట’, ‘తుచ్ఛ’ అనేవి. అయ్యర్‌ ఆ పదాన్ని వాడి ఉండాల్సిందా? లేదు. రాజకీయ చర్చ, అసలు ఏ చర్చయినాగానీ నాగరికమైనదిగా ఉండి తీరాలి. అయితే ఇంతకూ ఆ మాటకూ, కులానికి ఏమైనా సంబంధం ఉన్నదా? లేదు.

ఇక రెండవది మోదీ కులానికి సంబంధించిన సమస్య. ప్రధాని, ఘాంచి అనే బాగానే అభివృద్ధిచెందిన కులానికి చెందినవారు. వాళ్లు కిరాణా దుకాణాలు నడ పడం, నూనె తియ్యడం చేస్తారు. దుకాణాల్లో ధాన్యం (టీ కూడా) అమ్ముతారు. మోదీ అంటేనే, గాంధీలాగా పరిసర ప్రాంతంలోని కిరాణా దుకాణదారు అని అర్థం.

గుజరాతీలు ఘాంచీలను వెనుకబడిన కులంగా చూడరు. 1999లో వాజ్‌ పేయి హయాంలోనే అది వెనుకబడిన కులంగా లేదా ఓబీసీగా మారింది. కాబట్టి గుజరాతీలలో చాలా మందికి సంబంధించి ‘నీచ్‌’ అంటే వెంటనే ప్రధాని కులాన్ని కించపరిచే మాటని అనిపించదు.

ఈ కారణాల వల్లనే నేను దీన్ని ఉద్దేశపూర్వకంగానే పెద్దదిగా చేశారని, ప్రత్యే కించి ఎన్నికల ప్రచారంలో ప్రభావశీలమైన ఆయుధం కాగలదని భావించి అలా చేశారని అనుకుంటున్నాను. బీజేపీ విజయానికి (బీజేపీ గెలుస్తుందని నా అంచనా. గత వారం కాలమ్‌లో కూడా అదే రాశాను) నిర్దిష్టంగా దారితీసిన అంశం ఏదో, మీడియా సృష్టించిన గాలి కబుర్లు ఏవో కాలమే తేల్చాలి.

సోమనాథ ఆలయం రిజిస్టర్‌లో రాహుల్‌ గాంధీ సంతకం చేయడం వ్యవ హారం కాంగ్రెస్‌కు నష్టం కలిగించే అంశం అవుతుందేమోనని అనుకున్నా. కానీ ఆ తర్వాతి వార్తలను బట్టి చూస్తే అలాంటిదేమీ జరగలేదని తేలింది. రాహుల్‌ తనను హిందూయేతరునిగా నమోదు చేయించుకోవాలనుకుంటే గుజరాతీలు తప్పక ఆస క్తిని చూపేవారే. కానీ ఆయన ఆ పని చేయలేదు. అయితే ఆ కథనం ఇప్పుడు గతించిన చరిత్రగా మారిపోయింది. మీడియా ఆసక్తి మరో వైపునకు మరలింది. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టడాన్ని మణిశంకర్‌ అయ్యర్‌ షాజహాన్, ఔరంగజేబులు అధికారంలోకి రావడంతో పోల్చారనే అంశం ముందుకు వచ్చింది. ఆ విషయంపై వ్యాఖ్యానించిన వారిలో చాలా మంది ఆయన చెప్పినదాన్ని పూర్తిగా ఉల్లేఖించలేదనేది స్పష్టమే. అలా వ్యాఖ్యానించిన వారిలో నేనూ ఉన్నాను. రాహుల్‌ గాంధీ, ఔరంగజేబులను ఒకచోట చేర్చి ఏమి మాట్లాడినా దాన్ని మోదీ ఉపయోగించుకుంటారని అయ్యర్‌కు తెలిసి ఉండా ల్సింది. అలాగే మోదీ వాడుకున్నారు కూడా. ఇది ఓటర్లును ఎంతగా ప్రభావితం చేసే అంశం? ఇలాంటి ఏ ఒక్క విషయంపైనో ఆధారపడి ప్రజలు ఓటు చేస్తారని అనుకోను. కానీ, రెండు దశాబ్దాలు తాము పాలించిన రాష్ట్రంలో బీజేపీ తమ ప్రభుత్వం పనితీరును గురించి గాక, కాంగ్రెస్‌ గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించింది.  

అంతకు ముందు బీజేపీ, అహ్మద్‌పటేల్‌ ఒక ఆసుపత్రికి ట్రస్టీగా ఉన్నారని వెల్లడించింది. అలాగే ఉగ్రవాద ఆరోపణలున్న ఒక వ్యక్తి అహ్మద్‌ పటేల్‌ వద్ద ఉద్యోగిగానో లేక మాజీ ఉద్యోగిగానో ఉన్నారని ఆరోపించారు. పటేల్‌కు, ఆ ఆరోపణలకు గురైన వ్యక్తికి ఎలాంటి సంబంధమూ లేదు. కాబట్టి అదో బూటకపు కథనం. ఉగ్రవాదం విషయంలో కాంగ్రెస్‌ది మెతక వైఖరి అని చూపడం ద్వారా సాధారణంగా బీజేపీకి లబ్ధి కలుగుతుంది. కాబట్టే ఆ కథనాన్ని ముందుకు తెచ్చారు. కానీ చరిత్ర, గణాంకాలు అందుకు విరుద్ధమైన ఫలితాలనే చూపు తున్నాయి.

ఇక ఆ తర్వాత, కొద్ది రోజుల క్రితమే కపిల్‌ సిబల్‌ కథనం ముందుకు వచ్చింది. కాంగ్రెస్‌ నేత, న్యాయవాది అయిన ఆయన 2019 ఎన్నికల వరకు బాబ్రీ మసీదు కేసు తీర్పును వెలువరించరాదని సుప్రీం కోర్టును కోరారు. ఇలా పూర్తిగా సిద్ధం చేసి ఇచ్చిన సమాచారంతో మరో దఫా వార్తల్లో చక్కెర్లు కొట్టి వచ్చే అవ కాశాన్ని ఇది మోదీకి కల్పించింది. అయోధ్య వివాదం బీజేపీని జాతీయపార్టీని చేసింది. అయితే అదిప్పుడు రాజకీయంగా కాలం చెల్లిన అంశం. అయినా దాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే ప్రముఖమైన దాన్ని చేశారు.

మణిశంకర్‌ అయ్యర్‌ ఇప్పటికే తనకు నోరు మూసుకుని ఉండటం చేతకాదని నిరూపించుకున్నారు. తనను చంపడానికి ‘సుపారీ’ తీసుకోవాలని అయ్యర్‌ పాకిస్తానీలను కోరారని మోదీ మరో ఆరోపణ చేశారు. అయితే అది నిజం కాదను కోండి. ప్రధాని దాన్ని నిజమని విశ్వసిస్తూ ఉండాలి. అలా జరిగితే అది ఆందో ళనకరమైన విషయమే. లేకపోతే అది ఎన్నికల్లో ఉపయోగపడే అంశమని అను కోవడమైనా జరిగి ఉండాలి. ఇలా జరిగినా గానీ అది ఆందోళన చెందవలసిన విషయమే. వార్తా ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అన్ని, లేదా దాదాపు అన్ని వార్తా కథనాలూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ మీడియా మద్దతుతో ప్రవేశ పెట్టినవేనని కనబడుతూనే ఉంది. బీజేపీ సాగిస్తున్నది దూషణలు, భయాలతో కూడిన ప్రతికూల ప్రచారం. 2014లో సుపరిపాలన, అచ్చేదిన్‌ నినాదాలతో చేప ట్టిన సానుకూల ప్రచారాన్ని చేయాలనే కోరికే బీజేపీకి నేడు లేకపోవడం కొట్టవచ్చి నట్టు కనిపిస్తున్న విషయం.

ఇది దురదృష్టకరం. ఉపఖండంలో రాజకీయాలు సాగే పద్ధతి కూడా ఇదే. ఈ ఎత్తుగడలను ఉపయోగించాలనుకున్న ప్రతిచోటా బీజేపీ వాటిని ప్రయోగించ వచ్చు. మీడియా ముందుకు నెట్టాలని భావించే విధంగా దాన్ని ఆకట్టుకునే అంశా లను కాంగ్రెస్‌ పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో చేస్తున్నట్టుగా ఉద్దేశ పూర్వక మైన తప్పులు చేయకుండా చూసుకోవాల్సినది కాంగ్రెస్‌ పార్టీయే.


- ఆకార్‌ పటేల్‌

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top