టారో వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)

Weekly Tarot For 18th August To 24th August 2019 - Sakshi

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
సమస్యలు ఎదురైనంత మాత్రాన అనవసరంగా ఆందోళన చెందకండి. సమస్యల మూలకారణాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు, వాటిని అధిగమించడం తేలికవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న అవరోధాలు ఎదురైనా, అప్రమత్తంగా ఉంటే వాటిని అవలీలగా అధిగమించడం సాధ్యమవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.. త్వరలోనే భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో, సన్నిహిత మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆత్మబంధువులాంటి వ్యక్తి ఒకరు తారసపడతారు. 
లక్కీ కలర్‌: లేతగులాబి

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
నిజాయతీనే నమ్ముకుంటారు. ఇతరుల ప్రవర్తన ఎలా ఉన్నా పట్టించుకోకుండా, మీదైన శైలిలో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అంకితభావంతో విధులు నిర్వర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. భవిష్యత్తును మార్చగల అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. కొందరి ప్రవర్తన పట్ల విసిగిపోయి, సహనం కోల్పోతారు. స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ప్రకటనలు, ప్రచారం ద్వారా వ్యాపారాభివృద్ధిని సాధిస్తారు. పాత బాకీలను తీర్చేస్తారు. చాలాకాలంగా సాగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.
లక్కీ కలర్‌: పసుపు

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఇటు ఇంట్లోను, అటు పని ప్రదేశంలోనూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కొంత గందరగోళానికి లోనవుతారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. విడివడిన బంధాలు మళ్లీ ఒక్కటవుతాయి. సృజనాత్మక రంగాల్లోని వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో బాగా ఉపయోగపడగల కీలకమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. పురాతన పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురు ఎరుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
గతానికి చెందిన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడతారు. మానసికంగా కొంత కుదుటపడి, వర్తమానంలో జీవించడానికి అలవాటు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు. వ్యాపార లాభాలు పుంజుకుంటాయి. విదేశాల నుంచి విద్యార్థులకు మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించవచ్చు. వైద్య సహాయం అనివార్యమయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలను తలపెడతారు. ఒంటరిగా ఉంటున్నవారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురు గోధుమ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
సవాళ్లతో కూడుకున్న అవకాశాలు లభిస్తాయి. సవాళ్లకు భయపడకుండా అవకాశాలను అందుకుంటే, సమీప భవిష్యత్తులోనే అద్భుతమైన లాభాలు ఉంటాయి. విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. సాహస క్రీడల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి జ్యోతిషులు, ఆధ్యాత్మిక గురువుల సలహాలు తీసుకుంటారు. ప్రియతములకు విలాస వస్తువులను కానుకగా ఇస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు జటిలంగా మారే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: లేత ఆకుపచ్చ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
చాలాకాలంగా కోరుకున్న మార్పు ఈవారంలో సంభవించే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. కొందరికి స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి. భవిష్యత్తు గురించి అతిగా తాపత్రయపడతారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి, ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. వైద్యచికిత్స తప్పకపోవచ్చు. భవిష్యత్తు గురించిన ఆలోచనలను పక్కన పెట్టి వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం మంచిది. స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తేనే ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించిన లక్ష్యాలను సాధించగలుగుతారు.
లక్కీ కలర్‌: పసుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆస్తులు కలసివచ్చే సూచననలు ఉన్నాయి. వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషభరిత వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. ప్రేమ ప్రతిపాదనలపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. 
లక్కీ కలర్‌: నారింజ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆర్థికపరంగా పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సకాలంలో భారీమొత్తాల్లో రుణాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొంతకాలంగా ఇబ్బందిపెడుతూ వచ్చిన ఉన్నతాధికారి ఒకరికి స్థానచలనం కలగడం ఊరటనిస్తుంది. పిల్లల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సంప్రదాయాలను పిల్లలు ధిక్కరించడంతో మనస్తాపం చెందుతారు. మానసిక సాంత్వన కోసం ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయిస్తారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
లేనిపోని పట్టుదలలకు పోకుండా పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే పరిస్థితులు చక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లో సహచరులతో వాదులాటలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉన్నా, పాత బాకీలు వసూలు కాకపోవడం చిరాకు తెప్పిస్తుంది. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మిత్రుల్లో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కీళ్లనొప్పులు బాధించవచ్చు. ఇంటి అలంకరణల్లో మార్పులు చేస్తారు. పాత వాహనాన్ని వదుల్చుకుని కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. 
లక్కీ కలర్‌: బూడిద రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
జీవితాన్ని చిక్కుప్రశ్నలా భావించడం వల్ల సమస్యలను జటిలం చేసుకుంటారు. జీవితాన్ని అనుక్షణం ఆస్వాదించడం మొదలుపెడితే, ఏ సమస్యలూ మిమ్మల్ని ఇబ్బందిపెట్టవు. వృత్తి ఉద్యోగాల్లో నెలకొన్న స్తబ్దతకు విసుగు చెందుతారు. అవలీలగా మీరు చేసే పనులే అద్భుతమైన ఫలితాలనిస్తాయి. సాహిత్య కళారంగాల్లోని వారి కృషికి గుర్తింపు, సత్కారాలు ఉంటాయి. వ్యాపారాలకు జనాదరణ పెరుగుతుంది. రాజకీయ రంగంలోని వారికి ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల అనుబంధం పెళ్లికి దారితీస్తుంది.
లక్కీ కలర్‌: ఊదా

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
వారమంతా సంతోషభరితంగా సాగుతుంది. మిత్రులతో ఉత్సాహభరితంగా కాలక్షేపం చేస్తారు. అవసరంలో ఉన్న మిత్రులను ఆదుకుంటారు. ప్రియతముల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులతో కూడిన బదిలీలు ఉండవచ్చు. పిల్లలు సాధించిన విజయాలకు గర్విస్తారు. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ఆర్యోగంపై శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. ఆహార విహారాల్లో మార్పులు తప్పకపోవచ్చు. కుటుంబసభ్యులతో కలసి అరుదైన పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. 
లక్కీ కలర్‌: పసుపు
- ఇన్సియా, టారో అనలిస్ట్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top