వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు) | Weekly Horoscope From March 29th To april 4th In Sakshi Funday 2020 | Sakshi
Sakshi News home page

వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు)

Mar 29 2020 9:02 AM | Updated on Apr 5 2020 10:25 AM

Weekly Horoscope From March 29th To april 4th In Sakshi Funday 2020

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక విషయాలలో కొంత అసంతృప్తి. చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు శ్రమపడి విస్తరిస్తారు. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు.  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహి ణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ఎరుపు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. శ్రమ మరింత పెరుగుతుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక ఇబ్బంది పడతారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి కాగలరు. పారిశ్రామికవర్గాలకు కొంత గందరగోళ పరిస్థితి. వారం ప్రారంభంలో  శుభవార్తలు. వాహనయోగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకున్న విధంగా డబ్బు అంది అవసరాలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి మరింత పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. వారం« మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. తెలుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగప్రాప్తి. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, వారం చివరిలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వ్యతిరేకులను కూడా మీదారికి తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువుల రాక మరింత సంతోషం కలిగిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.  గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థికంగా కొంత నిరాశ చెందుతారు. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. విద్య, ఉద్యోగావకాశాలు కొంత అసంతృప్తి కలిగిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. వారం చివరిలో విందువినోదాలు. ధన, వస్తులాభాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉన్నా అవసరాలు తీరతాయి. మీ అంచనాలు కొన్ని తప్పి నిరుత్సాహం చెందుతారు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు ఎదురై సహనాన్ని పరీక్షిస్తాయి. విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. ఇంట్లో ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తప్పవు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. దైవదర్శనాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అంది ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. యుక్తిగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలబాట పడతారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయాలు. ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలమైనవిగా మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. గతం నుంచి వెంటాడుతున్న సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రులతో కొంత విభేదిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రత్యర్థులతో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలలో విరామం. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి కొద్దిపాటి చికాకులు, విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో విందువినోదాలు జరుపుకుంటారు. వాహనయోగం కలుగుతుంది. ధనలబ్ధి చేకూరుతుంది. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న సమయానికి డబ్బు సమకూరక ఇబ్బంది పడతారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురై నిరాశ చెందుతారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఇళ్ల నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు కాస్త నిరాశకు లోనవుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంతమేర చికాకులు ఎదురుకావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గులాబీ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. 
- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement