వారఫలాలు

Varafalalu( 28-04-2019) - Sakshi

28 ఏప్రిల్‌ నుంచి 4 మే 2019 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వివాహాది వేడుకల నిర్వహణకు సమాయత్తమవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు మరింత లాభించి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతోకలహాలు.  ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ప్రముఖులు పరిచయమవుతారు. ఆర్థిక విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. వాహనయోగం. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. గులాబీ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. విద్యార్థులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు కొంత ఫలిస్తాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనుకున్నదే తడవుగా పనులు చక్కదిద్దుతారు. ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. కొద్దికాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వివాహాది వేడుకలపై దృష్టి సారిస్తారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.  ఆరోగ్యపరంగా చికాకులు తప్పకపోవచ్చు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే అవకాశం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు కొంత జాప్యం జరిగినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. కుటుంబసభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.  స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒక అంగీకారానికి వస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. కొత్త రుణాలు కోసం యత్నాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. బంధువులు, మిత్రులు మీపై ఒత్తిడులు పెంచుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు. గృహం కొనుగోలు, నిర్మాణాలలో ఆటంకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కక డీలాపడతారు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శు¿¶ వార్తలు. ఆకస్మిక ధనలాభం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దికుని ముందుకు సాగుతారు. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు పొందుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి, లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, నలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పట్టుదల, ధైర్యంతో సమస్యలను అధిగమించి, విజయం సాధిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆరోగ్యసమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి సారిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  అందరిలోఉద్యోగాలలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో(28 ఏప్రిల్‌ నుంచి 4 మే, 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఇప్పటికే సాధించిన వరుస విజయాలతో మరింతగా బలం పుంజుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తారు. భవిష్యత్తును తీర్చిదిద్దుకునే లక్ష్యంతో ఆస్తులను సమకూర్చుకుంటారు. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. కళా సాంస్కృతిక రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు దొరుకుతాయి. మనసు దోచుకునే మనిషి తారసపడతారు. ప్రేమ వ్యవహారాల్లో భావోద్వేగాలకు లోనవుతారు. తీరిక సమయాన్ని ఆత్మావలోకనానికి కేటాయించుకుంటారు. ఆధ్యాత్మికతను నమ్ముకుంటారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అసాధారణమైన, అద్భుతమైన కాలం మొదలైంది. అదృష్టం ఎర్రతివాచీ పరచి మరీ మిమ్మల్ని స్వాగతిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలే పెట్టుబడిగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. పనిభారం ఎంతగా ఉన్నా, తెలివిగా పనిని విభజించుకుని సకాలంలో లక్ష్యాలను సాధిస్తారు. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. మార్గదర్శిగా నిలిచే వ్యక్తి ఒకరిని కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. త్వరలోనే కొత్త ఇంటిని లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలసి సుదూర విహారయాత్రలకు వెళతారు. 
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
చక్కబడిన పరిస్థితులు సంతోషాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే సమస్యలను సంయమనాన్ని కోల్పోకుండా పరిష్కరించుకుంటారు. నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో సాధిస్తారు. పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకుంటారు. బాధ్యతలకు దూరంగా ప్రకృతి ఒడిలో సేదదీరడానికి విహార యాత్రలకు వెళతారు. కొత్త మిత్రులు పరిచయమవుతారు. కొత్తగా కళాసాధన లేదా రచనా వ్యాసంగం వంటి వ్యాపకాన్ని ప్రారంభిస్తారు. సన్నిహిత బంధువుల మధ్య నెలకొన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరిస్తారు. గురువులను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: తెలుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ఇప్పటి వరకు సంపాదించినది, సాధించినది చాలనే భావన మొదలవుతుంది. ఇక చాలు అనే భావన బద్ధకం వైపు, నిర్లక్ష్యం వైపు, వ్యసనాల వైపు దారితీయకుండా చూసుకోవడమే మీరు ప్రస్తుతం చేయాల్సిన పని. ప్రతికూలమైన కాలక్షేపాలకు బదులు నచ్చిన వ్యాపకాన్ని ఎంచుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిష్ఠాత్మక విజయాలను సాధిస్తారు. సామాజికంగా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. పలుకుబడి గల వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు.
లక్కీ కలర్‌: నారింజ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
స్వయంకృతాపరాధాలకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచి తూచి అడుగు ముందుకేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పవచ్చు. ఆరోగ్య సమస్యలను ఆదిలోనే కట్టడి చేయడం మంచిది. వ్యాపార విస్తరణ ప్రణాళికల అమలును వాయిదా వేసుకుంటారు. ప్రత్యర్థులు మీపై వదంతులను ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిపై అతిగా స్పందించకుండా, సంయమనం పాటించడమే క్షేమం.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ప్రాధాన్యాలను నిర్ణయించుకోవడంలో డోలాయమానంలో పడతారు. సందిగ్ధతను విడనాడి, ముఖ్యమైన వాటిని ఎంపిక చేసుకుని, ప్రాముఖ్యత లేని విషయాలను విడనాడటం మంచిది. ఆదుర్దా విడనాడి కాస్త మనస్థిమితాన్ని సంతరించుకుంటే, మీ ప్రాధాన్యాలను మీరే నిర్ణయించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో వైవిధ్యం లేని పని చిరాకు కలిగిస్తుంది. సృజనాత్మకతకు అవకాశాలు దొరకని పరిస్థితుల పట్ల విసుగు చెందుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వాటికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారు.
లక్కీ కలర్‌: పసుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
వృథా కాలహరణం చేసినందుకు పశ్చాత్తాపం చెందుతారు. గత జల సేతుబంధనం కంటే భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రణాళికలను వెంటనే ఆచరణలో పెట్టడమే మంచిదనే నిర్ణయానికి వస్తారు. ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు, అధికారంతో కూడిన పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. స్థిరాస్తి విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. చట్టపరమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంటికి లేదా కార్యాలయానికి అలంకరణలు చేపడతారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. స్థిరచిత్తంతో నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అనూహ్యంగా మీకు అనుకూలంగా మారుతాయి. కీలకమైన బాధ్యతల నిర్వహణకు అధికారులు మీపైనే ఆధారపడే పరిస్థితులు ఉంటాయి. సంతోషభరితమైన సంఘటనలు జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాన్ని నిర్వహిస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు శ్రుతి మించే సూచనలు ఉన్నాయి. స్వయంగా చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దుకోవడం మేలు. అధిక బరువు కారణంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.
లక్కీ కలర్‌: లేత గులాబి

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
కొద్దిపాటి అవరోధాలు ఎదురైనా నిర్దేశించుకున్న లక్ష్యాలను విడనాడకండి. త్వరలోనే ఆశయ సిద్ధి జరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు దక్కవచ్చు. వ్యాపార విస్తరణ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలుగుతారు. బంధు మిత్రుల నుంచి కానుకలను అందుకుంటారు. స్వల్ప పరిచయం మాత్రమే ఉన్న వ్యక్తి ఒకరు మీకు కీలక సమయంలో అండగా నిలుస్తారు. చట్టపరమైన వివాదాల నుంచి బయటపడతారు. జనాకర్షణ పెరుగుతుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.
లక్కీ కలర్‌: ఎరుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
సాధించిన విజయాలు శ్రమను మరిపిస్తాయి. అనూహ్యమైన ఆర్థిక లాభాలు ఆనందంలో ముంచెత్తుతాయి. వ్యాపార భాగస్వామి ఒకరు ఇచ్చే అద్భుతమైన సలహాల ఫలితంగా లాభాలు రెట్టింపవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. స్థిరాస్తులలో భారీగా మదుపు చేస్తారు. కళారంగానికి చెందిన వ్యాపారాలను కొత్తగా ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు దొరుకుతాయి. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసాలకు ఖర్చు చేస్తారు.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అదనపు ఆదాయ మార్గాలను వెదుక్కోవలసిన పరిస్థితులు అనివార్యమవుతాయి. చాలా ప్రయాస తర్వాత మాత్రమే అవకాశాలను దక్కించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మొండి వైఖరి కారణంగా సమస్యలు మరింత జటిలమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అనుబంధానికి బీటలు పడే సూచనలు ఉన్నాయి. నిద్రలేని రాత్రులు తప్పకపోవచ్చు. వ్యసనాలతో సాంత్వన పొందే ప్రయత్నాలు వికటిస్తాయి. సంయమనం పాటించడం మంచిది. గురువుల సలహా తీసుకుంటారు.
లక్కీ కలర్‌: ఇటుక రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
జీవితంలో ఎన్నడూ లేని తాజాదనాన్ని అనుభూతి చెందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి స్థాన చలనం తప్పకపోవచ్చు. నిరంతర సంసిద్ధతే మీ విజయానికి బాటలు వేస్తుంది. సహచరుల నుంచి గొప్ప సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటికి అలంకరణలు చేపడతారు. సన్నిహితుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు అండగా నిలుస్తారు. జీవిత లక్ష్యాలలో కొన్ని ముఖ్యమైన వాటిని సాధిస్తారు. పిల్లలు సాధించిన విజయాలు సంతోషాన్నిస్తాయి. కుటుంబంలోని పెద్దల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగించవచ్చు.
లక్కీ కలర్‌: నీలం
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top