గ్రహం అనుగ్రహం (01-07-2020) | Daily Horoscope in Telugu (01-07-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (01-07-2020)

Jul 1 2020 6:27 AM | Updated on Jul 2 2020 6:17 AM

Daily Horoscope in Telugu (01-07-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.ఏకాదశి సా.4.56 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం విశాఖ రా.2.40 వరకు, తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.9.23 నుంచి 10.55 వరకు, దుర్ముహూర్తం ప.11.37 నుంచి 12.28 వరకు, అమృతఘడియలు... రా.6.23 నుంచి 7.58 వరకు, తొలి ఏకాదశి.

సూర్యోదయం :    5.32
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

గ్రహఫలం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృషభం: సత్తా చాటుకుంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మరింతగా చికాకులు.

కర్కాటకం: బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు వాయిదా. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

సింహం: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కన్య: అనుకోని ప్రయాణాలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో చికాకులు.

తుల: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృశ్చికం: కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: నూతన ఉద్యోగలాభం. కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం: వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాలు పరిష్కారం. వేడుకలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

మీనం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు.

Advertisement
 
Advertisement
Advertisement