ఇప్పుడు వీరు... వచ్చే యేడు ఎవరో! | tv shows programs by anil kapoor | Sakshi
Sakshi News home page

ఇప్పుడు వీరు... వచ్చే యేడు ఎవరో!

Dec 29 2013 1:26 AM | Updated on Sep 2 2017 2:04 AM

ఇప్పుడు వీరు...  వచ్చే యేడు ఎవరో!

ఇప్పుడు వీరు... వచ్చే యేడు ఎవరో!

పాత ఏడాది ముగిసిపోయి, కొత్త ఏడాది వస్తుంటే... పాతవి మిస్ అయ్యి, కొత్తవి వస్తాయి అనుకుంటారు. టెలివిజన్ ప్రేక్షకులకు ఆ బాధుండదు. సక్సెస్‌ఫుల్ టీవీ షోలు జనం చూసినంతకాలం సాగుతూనే ఉంటాయి.

టీవీక్షణం
 పాత ఏడాది ముగిసిపోయి, కొత్త ఏడాది వస్తుంటే... పాతవి మిస్ అయ్యి, కొత్తవి వస్తాయి అనుకుంటారు. టెలివిజన్ ప్రేక్షకులకు ఆ బాధుండదు. సక్సెస్‌ఫుల్ టీవీ షోలు జనం చూసినంతకాలం సాగుతూనే ఉంటాయి.
 
 2013లో బుల్లితెర జనాలను బాగానే కట్టి పడేసింది. అన్ని భాషా చానెళ్లూ ప్రేక్షకులను అలరించినా... హిందీ చానెళ్లు ప్రేక్షకులని పూర్తిగా తమ బుట్టలో వేసేసుకున్నాయి. దానికి కారణాలు రెండు. మొదటిది క్వాలిటీ, రెండోది ఎప్పటికప్పుడు కొత్తగా ఉండటం. గమనించి చూస్తే ఈ యేడు హిందీ చానెళ్లలోకి మహామహులు ప్రవేశించారు. ముఖ్యంగా సినీరంగంలోని వారు ఎంటరై దుమ్ము దులిపి పారేశారు. వారిలో ముఖ్యులు ముగ్గురు... అనిల్‌కపూర్, శేఖర్‌కపూర్, సంజయ్‌లీలా భన్సాలీ.
 
 అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శేఖర్ కపూర్ ఏబీపీ న్యూస్ చానెల్లో ‘ప్రధాన్‌మంత్రీ’ అనే ప్రోగాముకి హోస్టుగా బుల్లితెర ప్రవేశం చేశారీ యేడు జూలైలో. అద్భుతమైన యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అనిల్ కపూర్ 24 అనే డిఫరెంట్ టెక్నిక్‌తో కలర్స్ చానెల్లో అడుగుపెట్టారు. టైస్టు బ్యాగ్రౌండుతో సీరియల్ చేశారు. సక్సెస్ అయ్యారు. మూడో వ్యక్తి... సంజయ్‌లీలా భన్సాలీ. భన్సాలీ ఎంత గొప్ప సినిమాలు తీశారో తెలియంది కాదు. అలాంటివ్యక్తి టీవీ సీరియల్ తీస్తుంటే ఆసక్తి ఉంటుంది కదా! అదే ‘సరస్వతీచంద్ర’ సీరియల్‌కి బలం.
 
 సినిమాల్లోంచి వచ్చిన ఈ ముగ్గురూ ఈ యేడు సెన్సేషన్ సృష్టించడం విశేషం. వచ్చే యేడు కూడా జయాబచ్చన్ వంటి కొందరు సినీ ప్రముఖులు టెలివిజన్ రంగంలో అడుగిడబోతున్నారు. మరి వాళ్లేం సెన్సేషన్లు క్రియేట్ చేస్తారో చూడాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement