కొరుక్కుంటూ తాగండి | Super Cool Ice Shot Glass Mold Trey | Sakshi
Sakshi News home page

కొరుక్కుంటూ తాగండి

May 29 2016 2:39 AM | Updated on Sep 4 2017 1:08 AM

కొరుక్కుంటూ తాగండి

కొరుక్కుంటూ తాగండి

మనం కూల్ డ్రింక్స్ కూల్‌గా ఉండటానికి ఏం చేస్తాం..? ఆ డ్రింక్ ఉన్న గ్లాసుల్లో రెండు ఐస్ ముక్కలు వేసుకుంటాం. కానీ మీకెప్పుడైనా ఐస్ గ్లాసుల్లోనే...

మనం కూల్ డ్రింక్స్ కూల్‌గా ఉండటానికి ఏం చేస్తాం..? ఆ డ్రింక్ ఉన్న గ్లాసుల్లో రెండు ఐస్ ముక్కలు వేసుకుంటాం. కానీ మీకెప్పుడైనా ఐస్ గ్లాసుల్లోనే డ్రింక్స్ తాగాలని, వాటిని అమాంతం కొరుక్కు తినాలనిపించిందా? అయితే... తప్పకుండా మీకీ గ్లాసులు నచ్చుతాయి. వీటి కోసం షాపులకు తిరగాల్సిన పని లేదు. మీరే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే... ‘సూపర్ కూల్ ఐస్ షాట్-గ్లాస్ మోల్డ్ ట్రే’ అని కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. ఇందులో నీళ్లు పోసి డీప్‌ఫ్రిజ్‌లో పెడితే చాలు. ఐస్ గ్లాసులు రెడీ అయిపోతాయి..

తర్వాత దాంట్లో మీకు నచ్చిన ఫ్రూట్ జూస్ లేదా డ్రింక్స్‌ను పోసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు.. ముందుగా ఆ ట్రేలో ఒక జూస్‌ను పోసి, అది గ్లాసుగా మారాక అందులో మరోరకం జూస్‌ను పోసుకొని కూడా తాగొచ్చు. దాంతో ఒకేసారి రెండు జూసులను కూల్‌గా టేస్ట్ చేయొచ్చు. అలాగే పిల్లలకు ఇష్టమైన చాక్లెట్ లిక్విడ్స్‌లాంటివి కూడా ఇందులో పోసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement