చెమట వాసన పోవడానికి... | Summer Care | Sakshi
Sakshi News home page

చెమట వాసన పోవడానికి...

May 8 2016 12:29 AM | Updated on Sep 3 2017 11:37 PM

చెమట వాసన పోవడానికి...

చెమట వాసన పోవడానికి...

వేసవి అంటే చెమట.చెమట అంటే దుర్వాసన.దుర్వాసన అంటే చెప్పలేనంత ఇబ్బంది.మనకే కాదు... పక్కవారికి కూడా.

 సమ్మర్ కేర్
 వేసవి అంటే చెమట.చెమట అంటే దుర్వాసన.దుర్వాసన అంటే చెప్పలేనంత ఇబ్బంది.మనకే కాదు... పక్కవారికి కూడా.అయితే ఇది భరించలేనిదే తప్ప తొలగించలేనంత ఇబ్బందేం కాదు.చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే దుర్వాసనను దూరంగా తరిమేయొచ్చు.ముక్కు మూసుకోనక్కర్లేకుండా హ్యాపీగా తిరిగేయొచ్చు.
 
 1
 శరీరంలో గాలి సోకని ప్రదేశాల్లో చెమట ఉండిపోయి, బ్యాక్టీరియా పెరిగి, మెల్లగా దుర్వాసన మొదలవుతుంది. అలా అవ్వకూడదంటే... ఓ చెంచాడు బేకింగ్ సోడాని నిమ్మరసంలో వేసి కలపండి. దీన్ని ఆయా ప్రదేశాల్లో రాసుకోండి. కొద్ది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి. బేకింగ్ సోడా తడిని పీల్చేయడమే కాదు, బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. కాబట్టి రోజూ ఉదయం, సాయంత్రం ఇలా చేస్తే దుర్వాసన మాయమైపోతుంది.
 
 2
 చెమట వాసనకు చెక్ పెట్టడంలో నిమ్మకాయ సూపర్బ్‌గా పని చేస్తుంది. నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి, వాటితో అండర్ ఆర్మ్స్ (చంక)ల్లో రుద్దుకుని కడుక్కోవాలి. రోజూ ఇలా చేస్తే సమస్య తీరిపోతుంది. లేదంటే వేడినీళ్లలో నిమ్మరసం కలిపి, దానిలో దూదిని ముంచి రుద్దుకున్నా మంచిదే.
 
 3
 రోజ్‌మేరీ ఆకులు మార్కెట్లో దొరుకుతాయి. వాటిని తెచ్చుకుని, నాలుగు కప్పుల నీళ్లల్లో అరకప్పు ఆకులు వేసి మరిగించాలి. దీన్ని చల్లారబెట్టి సీసాల్లో దాచుకోవాలి. రోజూ స్నానం చేసే నీళ్లలో ఈ రసాన్ని కొద్దిగా కలిపి, పది నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే సరిపోతుంది.
 
 4
 వెనిగర్‌లో దూదిని ముంచి అండర్ ఆర్మ్స్‌లోను, ఎక్కువగా చెమట పట్టే ప్రాంతాల్లోనూ రాసుకుంటే... బ్యాక్టీరియా నశించిపోయి దుర్వాసన సమస్య తీరిపోతుంది.
 
 5
 టొమాటో నేచురల్ యాంటీసెప్టిక్. ఇది బ్యాక్టీరియాని చక్కగా చంపేస్తుంది. అందుకే పురాతన కాలంలో టొమాటో రసాన్ని స్నానం చేసే నీళ్లలో కలుపుకుని చేసేవారట. మీరూ అలా చేయవచ్చు. లేదంటే ఆ రసాన్ని దుర్వాసన వచ్చే చోట్ల రాసుకున్నా కూడా సమస్య తీరిపోతుంది.
 
 6
 ముల్లంగి రసంలో గ్లిసరిన్ కలిపి సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. కాసేపయ్యాక తీసి, ఓసారి బాగా గిలకొట్టి, ఆ రసాన్ని అండర్ ఆర్మ్స్‌లో రాసుకోండి. ఇది మంచి డియోడరెంట్‌లా పని చేస్తుంది. జిడ్డుగా కానీ, జిగురుగా కానీ ఉండదు. కాబట్టి రాసుకుని బయటకు కూడా వెళ్లిపోవచ్చు.
 
 7
 వాడేసిన టీపొడిని పారేయకండి. దానితో అండర్ ఆర్మ్స్‌లో బాగా రుద్దుకుని, చల్లని నీటితో కడుక్కోండి. దుర్వాసన దరికి చేరదు. లేదంటే నీటిలో టీ పొడి వేసి మరిగించి, వడకట్టి, అందులో నిమ్మరసం కలపండి. దీనితో కడుక్కుంటే చాలు.
 
 8
 ఓ కప్పు నీళ్లలో ఒక చెంచా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి బాగా కలపండి. ఓ శుభ్రమైన బట్టను ఈ మిశ్రమంలో ముంచి అండర్ ఆర్మ్స్‌లో రాసుకోండి. కొన్ని రోజులు ఇలా చేసి చూడండి... ఇక దుర్వాసన వస్తే ఒట్టు.హైడ్రోజన్ పెరాక్సైడ్ తడిని ఆరిపోయేలా చేయడమే కాకుండా బ్యాక్టీరియాను తరిమికొడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement