ఆడండి... నాలుగు స్తంభాలాట! | rekha story | Sakshi
Sakshi News home page

ఆడండి... నాలుగు స్తంభాలాట!

Published Sun, Nov 1 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

ఆడండి... నాలుగు స్తంభాలాట!

ఆత్మబంధువు
రేఖ షాపింగ్‌కి వెళ్లి తిరిగి వస్తుంటే కనపడింది సుమ. తమ కాలనీలోనే ఉంటుంది. మంచమ్మాయి. కానీ ఈ రోజెందుకో డల్‌గా కనిపించింది. ఆ మాటే అడిగింది. ‘‘అదేం లేదు రేఖా. బానే ఉన్నాను’’ అని సుమ సమాధానమిచ్చినా ఏదో దాస్తోందని అర్థమైంది. దాంతో ఆ సాయంత్రం ఇంటికెళ్లి విషయం అడిగింది. సుమ అంతా చెప్పింది. సుమ, రాజీవ్ పెళ్లి చూపుల్లోనే ప్రేమలో పడ్డారు. పెళ్లయ్యాక మరింత లోతుగా మునిగిపోయారు. సంవత్సరం తర్వాత పాప పుట్టింది. పాప బోసి నవ్వు లతో వారి జీవితం ఆనందమయమైంది. మరో ఏడాది గడిచింది. ఆ తర్వాతే చిరాకులు, పరాకులు మొదలయ్యాయి. మాటలతో మొదలై... తీవ్రస్థాయికి చేరుకున్నాయి.

దాంతో సుఖం, శాంతి కరువయ్యాయని చెప్పి ఏడ్చింది సుమ. ఆమె మాటలు విన్నాక... సుమ, రాజీవ్‌లిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమనీ, అయినా ఆ విషయం వారిద్దరికీ అర్థం కావడం లేదనీ రేఖకు అర్థమైంది. అందుకే వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడింది.
 ‘‘ఇంతకు ముందు ఎప్పుడూ నా చుట్టూనే తిరిగేవాడు. ఎంతో ప్రేమ చూపించేవాడు. కానీ ఇప్పుడు నన్నసలు పట్టించుకోవడంలేదు. ఎప్పుడూ ఆఫీసే’’ చెప్పింది సుమ.
‘‘సిటీలో రోజుకు రెండు గంటలు ప్రయాణం చేసి వస్తే నా కష్టమేమిటో తెలుస్తుంది’’ అన్నాడు రాజీవ్.
 ‘‘పొద్దుటనగా నువ్వు ఆఫీసుకు వెళ్లిపోతే సాయంత్రం వరకూ ఒంటరిగా పాపతో ఉంటే తెలుస్తుంది నా బాధేంటో’’ అంది సుమ. ‘‘నువ్వలా బాధపడుతున్నా వనేగా... రాగానే పాపను నేను తీసు కుంటున్నాను’’ అన్నాడు రాజీవ్. ‘‘పాపను తీసుకుని, ఆ వంకతో నన్ను దూరంగా ఉంచుతున్నావ్’’ నిష్టూర మాడింది.

‘‘నిన్ను దూరంగా ఉంచడ మేమిటి? నేను చేసేదంతా మన సంతోషం కోసమేగా!’’
 ఇలా సాగిపోయింది గొడవ. రేఖ ఆపింది. ‘‘మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఇద్దరూ కరెక్టే. దాన్ని ఫస్ట్ పొజి షన్ అంటారు. అంటే మన దృక్కోణంలో ప్రపంచాన్ని, మనుషుల్ని అర్థం చేసుకో వడం. ఆ పొజిషన్‌లోనే ఆగిపోతే మనం స్వార్థపరులం అవుతాం. మన సుఖం, సంతోషం తప్ప అవతలివారి గురించి పట్టించుకోం. అందుకే ఎప్పటికప్పుడు అవతలివారి పొజిషన్ నుంచి కూడా ఆలోచించాలి. దాన్నే సెకెండ్ పొజిషన్ అంటారు’’ అని చెప్పి సుమను దగ్గరకు పిలిచింది రేఖ. ‘‘ఇప్పటి వరకూ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో  సమస్యేమిటో చెప్పావ్. ఇప్పుడు కాసేపు కళ్లు మూసుకుని నిన్ను నువ్వు రాజీవ్‌లా ఊహించుకో.

రోజుకు రెండు మూడు గంటలు సిటీ బస్సుల్లో ప్రయాణించి ఇంటికొచ్చేసరికి ఏం కోరుకుంటావ్?’’
 ‘‘నా భార్య ఓ కప్పు కాఫీ ఇవ్వాలని, చిరాకులు పరాకులు లేకుండా స్వీట్‌గా మాట్లాడాలని కోరుకుంటా.’’
 ‘‘గుడ్. ఇప్పుడు నా పొజిషన్‌లోకి రా. అంటే మీ ఇద్దరికీ సంబంధంలేని మూడో వ్యక్తి పొజిషన్. దీన్నే థర్డ్ పొజిషన్ లేదా జడ్జ్ పొజిషన్ అంటారు. సుమగా, రాజీవ్‌గా ఇద్దరి వాదనలూ తెలుసు కున్నావ్. ఇప్పుడు వాళ్లిద్దరికీ సంబంధం లేని మూడో వ్యక్తిగా వారి వాదనలు వింటే ఏమనిపిస్తోంది?’’
 ‘‘అనవసరంగా గొడవ పడుతున్నా రనిపిస్తోంది.’’
 ‘‘ఎందుకలా గొడవ పడుతున్నారు?’’
 ‘‘ఎవరికి వారు వారి వాదనకే కట్టుబడి ఉండటం వల్ల.’’
 ‘‘ఇప్పుడు మళ్లీ సుమ స్థానంలోకి వచ్చి, నీ సమస్యని చూడు.’’
 సుమ పెదవులపై చిరునవ్వు మెరిసింది. ‘‘ఇంత సిల్లీగా గొడవ పడు తున్నామేమిటా అని నవ్వొస్తోంది’’ అంది.
 ‘‘ఇప్పటికైనా రాజీవ్ వాదనేమిటో, అసలేం చేయాలో అర్థమైందా?’’ అడిగింది రేఖ నవ్వుతూ.
 ‘‘పూర్తిగా అర్థమైంది.’’
 
ఆ తర్వాత రాజీవ్‌తోనూ అదే ప్రాసెస్ చేయించింది రేఖ. అతనూ సుమ వాదనే మిటో, తనేం చేయాలో అర్థం చేసుకు న్నాడు. సుమకు సారీ చెప్పాడు. తను కూడా సారీ చెప్పింది.  
 ‘‘మూడు పొజిషన్‌లూ మీకు అర్థమ య్యాయిగా. ఇంకోటుంది... ఫ్యామిలీ పొజిషన్. అంటే వ్యక్తులుగా కాకుండా ఉమ్మడిగా కలిసి కుటుంబం కోసం ఏం చేయాలో ఆలోచించడం, ఆచరించడం. కొన్ని రోజులపాటు ఈ నాలుగు స్తంభా లాట ఆడండి. ఏ పొరపొచ్చాలూ ఉండవు’’... చెప్పింది రేఖ. ఇద్దరూ రేఖకు థ్యాంక్స్ చెప్పి నవ్వుతూ ఇంటికెళ్లారు.
 - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

Advertisement
Advertisement
Advertisement