గోళ్లెక్కిన లేసులు | Oriental Lace Nail Art | Sakshi
Sakshi News home page

గోళ్లెక్కిన లేసులు

Oct 8 2016 9:59 PM | Updated on Sep 4 2017 4:40 PM

గోళ్లెక్కిన లేసులు

గోళ్లెక్కిన లేసులు

ఇది ‘ఓరియంటల్ లేస్’ నెయిల్ ఆర్ట్. దీన్ని వేసుకోవడానికి లైట్ రెడ్, వైట్, ట్రాన్స్‌పరెంట్ కలర్ నెయిల్ పాలిష్‌లను సిద్ధం చేసుకోవాలి.

నెయిల్ ఆర్ట్
ఇది ‘ఓరియంటల్ లేస్’ నెయిల్ ఆర్ట్. దీన్ని వేసుకోవడానికి లైట్ రెడ్, వైట్, ట్రాన్స్‌పరెంట్ కలర్ నెయిల్ పాలిష్‌లను సిద్ధం చేసుకోవాలి. ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోవడం చాలా సింపుల్‌గా ఉండటమే కాదు.. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని పిల్లల చేతులకు వేస్తే, వారు భలేగా ముచ్చట పడతారు. ఇప్పటివరకు చీరలు, డ్రెస్సులకే లేసులు వేయడం చూసుంటారు.. కానీ గోళ్లకూ వేయాలనుకుంటే.. ఈ నెయిల్ ఆర్ట్‌ను వేసుకుంటే సరి.
 
1.    ముందుగా గోళ్లన్నిటికీ లైట్ రెడ్ కలర్ నెయిల్ పాలిష్‌ను పూర్తిగా అప్లై చేయాలి. తర్వాత వైట్ పాలిష్‌తో మూడు చుక్కలు పెట్టుకోవాలి.
2.    ఇప్పుడు ఆ చుక్కలను మూడు పూరేకులుగా చేసుకోవాలి.
3.    ఆ పైన పూరేకులను ఫొటోలో కనిపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయాలి.
4.    తర్వాత వైట్ కలర్ పాలిష్‌తో మునుపటి డిజైన్‌కి పై భాగంలో సన్నగా అయిదు చుక్కలు పెట్టుకోవాలి.
5.    ఇప్పుడు ఆ చుక్కలకు ఇరువైపుల మరో రెండు రెండు చుక్కలు పెట్టాలి.
6.    ఫొటోలో కనిపిస్తున్న విధంగా వైట్ పాలిష్ వేసిన చోట లైట్ రెడ్ కలర్‌తో మూడు చుక్కలు పెట్టుకోవాలి.
7.    ఆ ఎరుపు రంగు చుక్కలను కూడా పూరేకుల్లా చేసుకోవాలి.
8.    తర్వాత ఆ ఎరుపు పూరేకులపై వైట్ కలర్‌తో మూడు గీతలు గీయాలి. చివరగా గోళ్లన్నిటి పై ట్రాన్స్‌పరెంట్ పాలిష్‌తో సింగిల్ కోట్ వేస్తే.. డిజైన్ లుక్కే మారిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement