ఈ అబ్బాయి అమ్మకూచి! | Mother Irmelin with Leonardo DiCaprio | Sakshi
Sakshi News home page

ఈ అబ్బాయి అమ్మకూచి!

May 10 2015 1:01 AM | Updated on Sep 3 2017 1:44 AM

ఈ అబ్బాయి అమ్మకూచి!

ఈ అబ్బాయి అమ్మకూచి!

సినీరంగంలో ‘అమ్మకూచి’ ముద్ర సాధారణంగా హీరోయిన్లకే ఉంటుంది.

అమ్మ జ్ఞాపకం
సినీరంగంలో ‘అమ్మకూచి’ ముద్ర సాధారణంగా హీరోయిన్లకే ఉంటుంది. అయితే, హాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న ‘టైటానిక్’ హీరో లియొనార్డో డికాప్రియో కూడా అమ్మకూచే. లియొనార్డో బాల్యంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. అతడి బాల్యంలో ఎక్కువ కాలం జర్మనీలోని తల్లి పుట్టింట్లోనే గడిచింది. ఐదుసార్లు ఆస్కార్, రెండుసార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సాధించిన డికాప్రియో, తన తల్లి కారణంగానే ఇన్ని విజయాలు సాధించగలిగానని చెప్పుకుంటాడు. పన్నెండో ఏటనే తాను నటుణ్ణవుతానని చెప్పడంతో తల్లి ఇర్మెలిన్ అతడికి అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేది.

బాలనటుడిగా టీవీ సీరియల్స్‌లో నటించిన డికాప్రియో, క్రమంగా హాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ‘టైటానిక్’ ఘనవిజయం తర్వాత పూర్తిగా అతడి దశ తిరిగిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement