మొటిమలు వచ్చాయా...? మీకు శుభవార్త...! | Medical History | Sakshi
Sakshi News home page

మొటిమలు వచ్చాయా...? అయితే మీకు ఇది శుభవార్త...!

Oct 23 2016 11:02 AM | Updated on Oct 9 2018 7:52 PM

మొటిమలు వచ్చాయా...? మీకు శుభవార్త...! - Sakshi

మొటిమలు వచ్చాయా...? మీకు శుభవార్త...!

మీకు గతంలో మొటిమలు ఎక్కువగా వచ్చే ఆరోగ్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉందా? మీ యుక్తవయసులో ముఖం

 మీకు గతంలో మొటిమలు ఎక్కువగా వచ్చే ఆరోగ్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉందా? మీ యుక్తవయసులో ముఖం అంతా మొటిమలు అని బాధపడ్డారా? అయితే అప్పుడలా రావడం నిజంగా అదృష్టమే. ఇలా మొటిమలు వచ్చే ఆరోగ్య చరిత్ర ఉన్నవారిలో వయసు పెరగడం (ఏజింగ్) వల్ల చర్మంలో వచ్చే మార్పులు చాలా ఆలస్యంగా వస్తాయంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. ఇలాంటి వారిలో చర్మం ముడుతలు పడటం కూడా చాలా ఆలస్యంగా జరుగుతుందని లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన జెనెటిక్ ఎపిడెమాలజీ విభాగానికి చెందిన నిపుణులు, ఈ పరిశోధనల్లో పాల్గొన్న బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ సిమోన్ రిబేరో పేర్కొంటున్నారు. ఈ విషయాలు జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీలో ప్రచురితం అయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement