ఇలా చెయ్యండి.. సెట్‌ అవుతుంది!

Lets Try These Hot Hair Dryer - Sakshi

బ్యూటీజర్‌

కేశాలంకరణతోనే మగువలకు అసలైన అందం సొంతమవుతుంది. విరబోసుకున్నా, విడివిడిగా పాయలు తీసి, జడలేసుకున్నా ముఖానికి కొత్త సోయగం వచ్చేస్తుంది.  పొందిగ్గా చీర కట్టుకున్నా, ఫ్యాషన్‌గా జీన్స్‌ వేసుకున్నా హెయిర్‌ స్టైల్‌ని బట్టి లుక్‌ మారిపోతుంది. అందుకే చాలా మంది రకరకాల హెయిర్‌ స్టైల్స్‌ ట్రై చేస్తూ ఉంటారు. ఇక హెయిర్‌ లీవ్‌ చేసుకోవడమంటారా..? ఇప్పుడే కాదు ఎప్పటికీ అది ట్రెండే. అయితే ఏ హెయిర్‌ స్టైల్‌ ట్రై చెయ్యాలన్నా జుట్టు మృదువుగా, పట్టులా ఉండాలి. అందుకే ఈ హాట్‌ హెయిర్‌ డ్రైయర్‌.

ఇది మేకప్‌ కిట్‌తో పాటు వెంట ఉంచుకుంటే చాలు. ఒకేసారి నాలుగు పనులు ఒకేదానితో చేసుకోవచ్చు. ఈ గాడ్జెట్‌ని తల స్నానం చేసిన తర్వాత హెయిర్‌ డ్రైయర్‌లా, చిక్కులు పడినప్పుడు దువ్వెనలా, మెలికలు తిరిగిన వెంట్రుకలను సరిచెయ్యడానికి హెయిర్‌ స్ట్రెయిటెనర్‌లా, ఫంక్స్, కర్లీ హెయిర్‌(రింగురింగుల జుట్టు) కావాలనుకున్నప్పుడు హెయిర్‌ కర్లర్‌లా మార్చుకోవచ్చు. వెట్‌ హెయిర్, స్ట్రెయిట్‌హెయిర్, కర్లీ హెయిర్‌ అనే మూడు ఆప్షన్స్‌తో పాటూ దువ్వెనలా కూడా ఈ గాడ్జెట్‌ ఉపయోగపడటంతో... నచ్చినప్పుడు నచ్చిన స్టైల్స్‌ ప్రయత్నిస్తూ.. నలుగురిలో ప్రత్యేకంగా మెరవచ్చు.

దీని మీద హై, మిడిల్, లో, ఆఫ్‌ అనే ఆప్షన్స్‌ ఉంటాయి. ఈ గాడ్జెట్‌కి కిందవైపు ఉన్న రెగ్యులేటర్‌ ఎడమ నుంచి కుడికి తిరుగుతుంది. దాంతో మోడ్స్‌ మార్చుకోవచ్చు. దీని ధర సుమారుగా 15 వందలు (21 డాలర్లు). ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. జుట్టు కోసం ఎక్కువ సమాయాన్ని వెచ్చించలేక, జుట్టు పాడవుతుందని బాధపడేవాళ్లు.. హెయిర్‌ స్టైల్‌ మీద ఎక్కువ శ్రద్ధ చూపించేవాళ్లకి ఈ గాడ్జెట్‌ భలే ఉపయోగడుతుంది. అప్పుడు మీరు అనొచ్చు షాంపూ యాడ్‌లా ‘ఇలా చేశాను.. సెట్‌ అయ్యింది..’ అని. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top